For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే.

|

భారత్‌లో క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10 కంపెనీలు అంటే దాదాపు అందరికీ తెలిసిందే. భారత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంటుంది. ఆ తర్వాత టాటా కన్సల్టన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంటాయి. అలాగే, మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీలు అంటే అలీబాబా, టెస్లా, ఫేస్‌బుక్, ఆపిల్ వంటివి గుర్తుకు వస్తాయి.

మార్కెట్ క్యాప్

మార్కెట్ క్యాప్

మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా ఆపిల్ 2.25 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ ఔట్ స్టాండింగ్ షేర్ల ఆధారంగా ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పరిగణిస్తారు. జూన్ 11, 2011 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలు ఇలా ఉన్నాయి.

టాప్ 3 కంపెనీలు

టాప్ 3 కంపెనీలు

- ఆపిల్ 2.108 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ముందు ఉంది. ఆపిల్ టెక్నాలజీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది.

- 1.938 ట్రిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో ఉంది. ఇది కూడా టెక్నాలజీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది.

- 1.888 ట్రిలియన్ డాలర్లతో సౌదీ ఆరామ్‌కో మూడో స్థానంలో ఉంది. ఇది సౌదీ అరేబియా కంపెనీ. ఎనర్జీ రంగంలో ఉంది.

- అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన అమెజాన్ ఇంక్ 1.691 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇది కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగంలో ఉంది.

టాప్ 10లో మరిన్ని..

టాప్ 10లో మరిన్ని..

- గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.656 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉంది. ఇది కూడా టెక్నాలజీ కంపెనీ.

- సోషల్ మీడియా (టెక్నాలజీ) దిగ్గజం ఫేస్‌బుక్ 942.77 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉంది.

- చైనాకు చెందిన టెన్సెంట్ మార్కెట్ క్యాప్ 742.36 డాలర్లుగా ఉంది. ప్రపంచంలో ఇది ఏడో స్థానంలో ఉంది.

- అమెరికాకు చెందిన బ్రెక్‌షైర్ హాత్‌వే మార్కెట్ క్యాప్ 654.46 డాలర్లు కాగా, ఇది ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది ఫైనాన్షియల్ సెక్టార్.

- టెస్లా ఇంక్ 582.32 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది కన్స్యూమర్ డిస్క్రిషనరీ రంగంలో ఉంది.

- చైనాకు చెందిన అలీబాబా 577.36 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో ఉంది.

English summary

మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే. | market cap: world top 10 biggest companies in 2021

With a market cap of $2.25 trillion, Apple regained its position as world's largest company in this year as of June 2021.
Story first published: Sunday, June 13, 2021, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X