For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.56 లక్షల కోట్లు జంప్

|

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,56,317.17 కోట్లు ఎగిసిపడింది. గతవారం సెన్సెక్స్ మొదటిసారి 60,000 మార్కును దాటి చరిత్రను సృష్టించింది. క్రితం వారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ 1,032 పాయింట్లు లేదా 1.74 శాతానికి పైగా లాభపడింది. సెన్సెక్స్ చివరి సెషన్(శుక్రవారం)లో 60,158.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,333.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,946.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,897.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,947.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,819.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 163.11 (0.27%) పాయింట్లు ఎగిసి 60,048.47 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30.25 (0.17%) పాయింట్లు లాభపడి 17,853.20 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు వారం టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.65,464 కోట్లు ఎగిసింది.

మార్కెట్ క్యాప్ జంప్

మార్కెట్ క్యాప్ జంప్

గతవారం దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,671.55 కోట్లు లాభపడి రూ.15,74,052.03 కోట్లకు చేరుకుంది. గురువారం ఓ సమయంలో షేర్ ధర భారీగా పెరిగినప్పుడు రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.16 లక్షల కోట్లకు చేరుకుంది. చివరకు ఈ మార్కుకు దిగువన ముగిసింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈసారి పెరిగింది. గతవారం రూ.30,605.08 కోట్లు పెరిగి రూ.7,48,032.17 కోట్లకు చేరుకుంది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.22,173.04 కోట్లు పెరిగి రూ.4,70,465.58 కోట్లకు చేరుకుంది.

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.15,110.63 కోట్లు పెరిగి రూ.14,32,013.76 కోట్లకు చేరుకుంది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,142 కోట్లు పెరిగి రూ.8,86,739.86 కోట్లకు పెరిగింది.

- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.6,068.69 కోట్లు ఎగిసి రూ.4,05,970.66 కోట్లకు చేరుకుంది.

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.4,863.65 కోట్లు పెరిగి రూ.6,44,199.18 కోట్లకు చేరుకుంది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,254.75 కోట్లు పెరిగి రూ.4,01,978.75 కోట్లుగా నమోదయింది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,523.56 కోట్లు ఎగిసి రూ.5,13,073.85 కోట్లకు పడిపోయింది.

- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,904.22 కోట్లు పెరిగి రూ.5,01,080.90 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు వరుసగా...

టాప్ 10 కంపెనీలు వరుసగా...

గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

ఈ వారం ప్రభావం

ఈ వారం ప్రభావం

గతవారం దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. కానీ ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సంక్షోభంలో ఉన్న చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ బాండ్స్ వడ్డీ చెల్లింపులపై మళ్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సూచీలు కాస్త అప్రమత్తంగా కదిలాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా లేదా నష్టాల్లో ఉండటంతో ఈ వారం సూచీలపై ప్రభావం చూపే అవకాశముంది.

English summary

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.56 లక్షల కోట్లు జంప్ | Market cap of top 10 valued firms jumps over Rs.1.56 lakh crore

The top 10 valued firms added a total Rs 1,56,317.17 crore to their market valuation last week, helped by across the board rally which catapulted the benchmark index Sensex to the record 60,000 mark for the first time.
Story first published: Sunday, September 26, 2021, 17:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X