For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్‌బుక్‌కు కంపెనీలు 'యాడ్ బహిష్కరణ', రూ.53వేల కోట్ల నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల పలు కంపెనీలు ఫేస్‌బుక్ నుండి అడ్వర్టయిజ్‌మెంట్లు విరమించుకున్నాయి. దీంతో జుకర్‌కు ఏకంగా 7.2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అంతేకాదు, శుక్రవారం ఫేస్‌బుక్ స్టాక్స్ కూడా 8.32 శాతం మేర నష్టపోయాయి. ట్విట్టర్ స్టాక్స్ కూడా నష్టపోయాయి. ఈ షేర్లు 7.39 శాతం మేరనష్టపోయాయి.

boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్boycott china: చైనీయులకు గదులివ్వం, భోజనం పెట్టం.. హోటల్స్&రెస్టారెంట్స్

ఫేస్‌బుక్‌కు ప్రకటనలు నిలిపివేత

ఫేస్‌బుక్‌కు ప్రకటనలు నిలిపివేత

ప్రపంచంలో అతిపెద్ద ప్రకటనదారు యూనీలీవర్ కంపెనీ. ఈ సంస్థ ఫేస్‌బుక్‌కు ప్రకటనలను బహిష్కరించింది. ఇదే దారిలో పలు కంపెనీలు నడిచాయి. మరిన్ని కంపెనీలు కూడా అదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. వెరిజాన్ కమ్యూనికేషన్స్, బెన్ అండ్ జెర్రీ సంస్థలు కూడా జత కలిశాయి. దీంతో ఫేస్‌బుక్ ప్రారంభంలోనే 7.2 శాతం మేర నష్టపోయింది.

తగ్గిన జుకర్ బర్గ్ సంపద..

తగ్గిన జుకర్ బర్గ్ సంపద..

ఈ ఏడాది ఫేస్‌బుక్ ప్రాపర్టీలలో ఖర్చు చేయడాన్ని తగ్గిస్తామని పలు కంపెనీలు తెలిపాయి. నెల రోజులుగా కోకాకోలా కూడా ప్రకటనలు ఇవ్వడం మానివేసింది. వరుసగా వివిధ కంపెనీలు ప్రకటనలు మానివేయడం సోషల్ మీడియా షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో ఫేస్‌బుక్ మార్కెట్ వ్యాల్యూ 56 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. జుకర్ బర్గ్ సంపద 82.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో అతను ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుండి నాలుగో స్థానానికి పడిపోయారు. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్ జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఉన్నారు. ఇప్పుడు బెర్నాల్డ్ అర్నాల్డ్ మూడో స్థానానికి వచ్చారు.

రూ.53వేల కోట్లకు పైగా నష్టం

రూ.53వేల కోట్లకు పైగా నష్టం

ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం వస్తోందని విమర్శలు వచ్చాయి. నకిలీ వార్తలను, విద్వేషపూరిత పోస్టుల కట్టడీకి చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో పలు కంపెనీలు ఫేస్‌బుక్‌కు యాడ్స్ నిలిపివేశాయి. దీనిపై జుకర్ బర్గ్ స్పందిస్తూ.. వర్ణ వివక్ష, విద్వేష వ్యాఖ్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుండి తాను ప్రకటించే విధానాల్లో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండదన్నారు. మన కరెన్సీలో దాదాపు రూ.53వేల కోట్లకు పైగా జుకర్ బర్గ్ నష్టపోయారు.

English summary

ఫేస్‌బుక్‌కు కంపెనీలు 'యాడ్ బహిష్కరణ', రూ.53వేల కోట్ల నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్ | Mark Zuckerberg has $7 billion wiped off his fortune

Critics of Facebook Inc who have assailed the social network as failing to adequately police hateful and misleading content on its service found a powerful ally Friday: Unilever, one of the world’s largest advertisers, said it would stop spending money with Facebook’s properties this year.
Story first published: Saturday, June 27, 2020, 18:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X