For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG subsidy: గ్యాస్ సిలిండర్ ఊరట.. ప్రయివేటీకరించాక కూడా ఎల్పీజీ సబ్సిడీ

|

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL)ను ప్రయివేటీకరణ చేయనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా బీపీసీఎల్ వాటాలను విక్రయించనుంది. BPCLను ప్రయివేటీకరిస్తే వంటగ్యాస్ సబ్సిడీ కొనసాగుతుందా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై చమురు మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టతనిచ్చారు. బీపీసీఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు.

అప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదుఅప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదు

BPCLను ప్రయివేటీకరించినప్పటికీ వంట గ్యాస్ పైన సబ్సిడీ కొనసాగుతుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వంట గ్యాస్ రాయితీ నేరుగా వినియోగదారులకే బదలీ చేస్తున్నామని, మధ్యలో ఏ కంపెనీలు ఉండవని స్పష్టం చేశారు. కాబట్టి చమురు రంగ సంస్థ ప్రభుత్వానిదా, ప్రయివేటుదా అనేది అనవసరమన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా BPCL కస్టమర్లకు ఎల్పీజీ సబ్సిడీ కొనసాగుతుందన్నారు.

LPG subsidy for BPCL consumers to continue post privatisation

గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల వంట గ్యాస్ పైన రాయితీ కల్పిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సిలిండర్లు రాయితీతో కొనుగోలు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం నేరుగా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదలీ చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బీపీసీఎల్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థలపై రాయితీ అందుతోంది.

English summary

LPG subsidy: గ్యాస్ సిలిండర్ ఊరట.. ప్రయివేటీకరించాక కూడా ఎల్పీజీ సబ్సిడీ | LPG subsidy for BPCL consumers to continue post privatisation

LPG customers of Bharat Petroleum Corporation Limited (BPCL) will continue to get cooking gas subsidy post-privatisation of the nation’s second-biggest fuel retailers, Oil Minister Dharmendra Pradhan said on Friday.
Story first published: Friday, November 27, 2020, 22:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X