గ్యాస్ సిలిండర్ వాడే వారికీ గుడ్ న్యూస్.. ధరలు తగ్గించిన కంపెనీలు.. నేటి నుంచే అమల్లోకి..
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. నేడు వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. దింతో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ.24 తగ్గింది. ఇప్పుడు ఈ సిలిండర్ దేశ రాజధాని ఢిల్లీలో రూ.1723.50కి లభిస్తుంది. కొత్త ధరలు జూన్ 1 నుండి అంటే ఇవాళ్టి నుండి అమలులోకి వస్తాయి. వాణిజ్య LPG సిలిండర్లను ఎక్కువగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఇంకా ఇతర వాణిజ్య సంస్థలలో ఉపయోగిస్తారు.

ఇప్పుడు రూ.24 తక్కువ ధరకే లభిస్తున్న సిలిండర్: వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించడంతో ఈ మార్పు జూన్ 1 నుండి అమల్లోకి తెచ్చింది. ఢిల్లీలో రూ.1747 ఉన్న 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ 24 రూపాయలు తగ్గడంతో ఇప్పుడు రూ.1723.50కి లభిస్తుంది.
అయితే ఈ LPG వాణిజ్య సిలిండర్ల ధరలో తగ్గింపు చిరు వ్యాపారాల నుండి పెద్ద పెద్ద హోటళ్లు, క్యాష్ వినియోగదాఫులకు శుభవార్త అని చెప్పవచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. ఇంకా గ్యాస్ ధరల కోత ఆర్థిక వ్యవస్థపై స్వల్ప సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
హోటళ్ళు ఇంకా రెస్టారెంట్లు ప్రయోజనం :వాణిజ్య LPG సిలిండర్లను ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు అలాగే ఇతర వాణిజ్య సంస్థలలో ఉపయోగిస్తారు. ధరల తగ్గింపు ఈ వ్యాపారాల నిర్వహణ ఖర్చులను కొద్దిగా తగ్గిస్తుంది. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఈ తగ్గుదల చాలా కాలం పాటు కొనసాగితే అది పరోక్షంగా ఆహారం ఇంకా ఇతర సేవల ధరలను స్థిరంగా ఉంచడానికి లేదా వాటిని కొద్దిగా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సాధారణ వినియోగదారులు కూడా దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. తక్కువ ఖర్చులు వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని అందించగలవు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
వరుసగా మూడు నెలల నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గుతూ వచ్చింది. 2025 ఏప్రిల్ 1న 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.41, మేలో రూ.14.50 తగ్గింది. ధరల తగ్గింపు తరువాత ప్రస్తుతం హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.50 తగ్గి రూ. 1943.50 గాను, అలాగే విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.50 తగ్గి రూ.1880.50గా ఉంది. ఇక 14 కేజీల వంటింటి గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో 14 కేజీల వంటింటి గ్యాస్ సిలిండర్ ధర రూ. 905గాను, అలాగే విజయవాడలో రూ. 877.50 లుగా ఉంది.