For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG prices: గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, 2012 తర్వాత సెకండ్ హయ్యెస్ట్

|

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. జనవరి 1, 2022 నుండి కమర్షియల్ సిలిండర్ ధర పైన రూ.102.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1998.50కి తగ్గింది. రెస్టారెంట్లు, ఈటరీస్, టీ స్టాల్స్ తదితర కమర్షియల్ సిలిండర్ ధరల వినియోగదారులకు ఇది భారీ ఊరట. గత నెల అంటే డిసెంబర్ 1 (2021)లో 19 కిలోల సిలిండర్ పైన రూ.100 పెరిగింది. ఇప్పుడు అంతకంటే కాస్త ఎక్కువ తగ్గింది. నాటి పెంపుతో నిన్నటి వరకు ఢిల్లీలో రూ.2101గా ఉంది.

ఇది సెకండ్ హయ్యెస్ట్

కమర్షియల్ సిలిండర్ ధర 2012-13 ఆర్థిక సంవత్సరంలో అన్నింటి కంటే గరిష్టంగా ఉంది. అప్పుడు ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.2,200కు పెరిగింది. ఆ తర్వాత రెండో హయ్యెస్ట్ ధర నిన్నటి వరకు నెల రోజుల పాటు (రూ.2,101 వద్ద) కొనసాగింది. ఏడేళ్ల క్రితం 2012లో ఆల్ టైమ్ గరిష్టం నమోదయింది. అయితే గత నెలలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగలేదు. అలాగే ఈసారి పెరగలేదు. 14.2 కిలోల సిలిండర్లతో పాటు 5 కిలోలు, 10 కిలోల సిలిండర్ ధరల్లో మార్పులేదు.

LPG prices January 1: Commercial LPG cylinder price slashed

ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1998.50గా ఉంది. కోల్‌కతాలో రూ.2072, ముంబైలో రూ.1948.5, చెన్నైలో రూ.2132గా ఉంది. మీకు ధరలు పూర్తిగా తెలియడానికి, అలాగే ప్రతినెల మారిన విషయాలు తెలుసుకోవడానికి మీ మీ చమురు మార్కెటింగ్ వెబ్ సైట్‌లోకి వెళ్లి చూడాలి.

English summary

LPG prices: గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, 2012 తర్వాత సెకండ్ హయ్యెస్ట్ | LPG prices January 1: Commercial LPG cylinder price slashed

In some relief for consumers on New Year, National Oil Marketing companies have slashed the prices of 19 kg commercial LPG cylinder cost by Rs 102.50 effective from January 1, 2022.
Story first published: Saturday, January 1, 2022, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X