For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు

|

నవంబర్ నెలకు గాను గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ఈ మేరకు చమురురంగ కంపెనీలు ఈ నెలకు గాను ధరల పట్టికను విడుదల చేశాయి. వరుసగా మూడో నెల ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎలాంటి మార్పులేదు. అక్టోబర్‌లో కేవల కమర్షియల్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ నెల దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సిడైజ్డ్ సిలిండర్ ధరలు యథాతథంగా రూ.594గా ఉన్నాయ. ఈ మేరకు చమురురంగ కంపెనీలు HPCL, BPCL, IOC ధరలు విడుదల చేసాయి. ఇతర నగరాల్లోను ధరల్లో మార్పులేదు. అయితే కమర్షయల్ సిలిండర్ ధరలు రూ.78 పెరిగింది.

ఏడాదిలో భారీగా పెరిగిన ఆలు, ఉల్లి: ధరలు తగ్గుతాయా, ప్రభుత్వం ఏం చేస్తోంది?ఏడాదిలో భారీగా పెరిగిన ఆలు, ఉల్లి: ధరలు తగ్గుతాయా, ప్రభుత్వం ఏం చేస్తోంది?

వినియోగదారులకు ఊరట

వినియోగదారులకు ఊరట

గ్యాస్ సిలిండర్ ధరలు ఈసారి పెరుగుతాయని భావించారు. కానీ, చమురు మార్కెటింగ్ కంపెనీలు స్థిరంగా ఉంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర మాత్రం గత నెల పెరిగింది. ఈసారి కూడా రూ.78 పెంచారు. సిలిండర్ ధర జూలైలో రూ.4, జూన్‌లో రూ.11 చొప్పున పెరిగాయి. మే నెలలో రూ.162 తగ్గింది. తాజా ఎల్పీజీసిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి... ఢిల్లీలో రూ.594, ముంబైలో రూ.594, చెన్నైలో రూ.610, కోల్‌కతాలో రూ.620గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.646.50గా ఉంది.

కమర్షియల్ ధర మాత్రం రూ.78 జంప్

కమర్షియల్ ధర మాత్రం రూ.78 జంప్

ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,166 నుండి రూ.1,241కి పెరిగింది. ఈ సిలిండర్ ధర ఇక్కడ రూ.75 పెరిగింది.

కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,220 నుండి రూ.1,296కు పెరిగింది. ధర రూ.76 పెరిగింది.

ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,113.50 నుండి రూ.1,189.50కి పెరిగింది. ధర రూ.76 ఎగిసింది.

చెన్నైలో ఇదే సిలిండర్ ధర రూ.1,276 నుండి రూ.1,354కు పెరిగింది. ఇక్కడ రూ.78 ఎగిసింది.

నెలకోసారి సమీక్ష

నెలకోసారి సమీక్ష

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల మొదటి తారీఖున సమీక్షిస్తాయి చమురు రంగ కంపెనీలు. మార్చి నుండి కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ సమయంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పడిపోయాయి. అయితే ఇటీవల డిమాండ్ పుంజుకోవడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే 40 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా సిలిండర్ ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి.

English summary

వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు | LPG Cylinder Price: LPG becomes expensive in November

Oil marketing companies have released the gas price for the month of November. LPG Gas Cylinder prices remained unchanged for the third consecutive month of August-September, but commercial cylinders became expensive in October.
Story first published: Tuesday, November 3, 2020, 7:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X