For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG cylinder price: పెట్రోల్, డీజిల్ ఊరట ఇచ్చిన భారంగా మారిన సిలిండర్ ధర

|

గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పెట్రోల్ ధరలపై ఊరటగా ఉన్న సామాన్యుడికి దేశీయ పెట్రోలియం కంపెనీలు షాకిచ్చాయి. డొమెస్టికి ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. నాన్-సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పైన ధరను రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.834.50 నుండి రూ.859.5కి పెరిగింది. అంతకుముందు జూలై 1వ తేదీన సిలిండర్ ధరలు పెరిగాయి. నాడు సిలిండర్ పైన రూ.25.50 పెరిగింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834.50 నుండి రూ.859.5కి, కోల్‌కతాలో రూ.861 నుండి రూ.886కి, చెన్నైలో రూ.850.50 నుండి రూ.875.50కి, లక్నోలో రూ.897.5, అహ్మదాబాద్‌లో రూ.866.50కు పెరిగింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.887 నుండి రూ.912కు పెరిగింది. కొచ్చిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.866కు, తిరువనంతపురంలో రూ.869కి చేరుకుంది.

LPG cylinder price hike, how much it will cost now

సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన చమురు రంగ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ సవరణ ఉంటుంది. అయితే 2021 ప్రారంభంలో అంటే ఈ జనవరిలో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉండగా, ఫిబ్రవరి నాటికి రూ.719కి పెరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన మరోసారి పెరిగి రూ.769కి, ఫిబ్రవరి 25న పెరిగి రూ.794కు, పెరిగింది. మార్చి నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.819కి పెరగగా, ఏప్రిల్ నెలలో రూ.10 తగ్గి రూ.809కు తగ్గింది. ఈ ఏడాది ఎల్పీజీ సిలిండర్ ధర రూ.165.50 పెరిగింది.

English summary

LPG cylinder price: పెట్రోల్, డీజిల్ ఊరట ఇచ్చిన భారంగా మారిన సిలిండర్ ధర | LPG cylinder price hike, how much it will cost now

Petroleum companies have once again increased the prices of Domestic LPG cylinders.
Story first published: Tuesday, August 17, 2021, 22:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X