LPG Cylinder Price: సిలిండర్ ధరలు ఈ నెల ఎలా ఉన్నాయంటే?
నాన్-సబ్సిడైజ్డ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు నవంబర్ నెలలో యథాతథంగా ఉన్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఈ సమీక్షలో భాగంగా ఈ నెలలో ధరలో ఎలాంటి మార్పులేదు. జూన్, జూలై నెలలో స్వల్పంగా ధరలు పెరిగిన అనంతరం, వరుసగా ఐదో నెలలో ధరలో మార్పులేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో నాన్ సబ్సిడైజ్డ్ సిలిండర్ ధర (14.2 కిలోలు) రూ.594గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోను అదే ధర ఉంది. దేశీయ అతిపెద్ద చమురు రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ ఇండేన్ బ్రాండ్ పేరుతో ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తుంది.
PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!

ధరలు యథాతథం.. ఏ నగరంలో ఎంతంటే
కుకింగ్ గ్యాస్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఢిల్లీలో అక్టోబర్ నుండి ఇండేన్ గ్యాస్ సిలిండర్ ధర రూ.594గా ఉంది. కోల్‌కతాలో రూ.620.50గా ఉంది. ముంబైలో రూ.594గా ఉంది. చెన్నైలో రూ.610గా ఉంది. నాలుగు మెట్రో నగరాల్లో కోల్‌కతాలో ధర ఎక్కువగా ఉంది. ఢిల్లీ, ముంబైలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి ఏడాది 12 సిలిండర్లు (14.2 కిలోలు) సబ్సిడీ పైన అందిస్తుంది. అంతకుమించి సిలిండర్లు కావాలంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే.

ఇలా బుక్ చేసుకోవచ్చు..
నవంబర్ 1వ తేదీ నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా కూడా బుక్ చేసుకునే సౌకర్యం తెచ్చారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడటం ద్వారా, మొబైల్ నెంబర్ నుండి ఫోన్ చేయడం ద్వారా, వెబ్ సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ బుకింగ్ చేయడం ద్వారా, కంపెనీ వాట్సాప్ నెంబర్‌కు సందేశం పంపించడం ద్వారా, ఇండేన్ గ్యాస్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని కూడా బుక్ చేసుకోవచ్చు.

19 కిలోల సిలిండర్ ధర జంప్
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ అక్టోబర్, నవంబర్ నెలలోనూ గ్యాస్ సిలిండర్ ధరను స్థిరంగా కొనసాగించాయి. ఈనెల కూడా అదే ధరలు ఉన్నాయి. 14 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. సిలిండర్ ధర రూ.55 పైకి కదిలింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర చెన్నైలో రూ.56 పెరిగి రూ.1,410, ఢిల్లీలో రూ.55 పెరిగి రూ.1,296గా ఉంది. ముంబైలో రూ.1,351, ముంబైలో రూ.1,244గా ఉంది.