For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీతభత్యాలు తగ్గిస్తే వీధుల్లో నివసించాలి: ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

బ్యాంకుల్లో నిధులున్నాయి..రుణాలు తీసుకునే వారే లేరు అని ఇతెవాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఇప్పుడు తాజాగా మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 రుణదాతలలో ఒకటైన మరియు 30 లక్షల కోట్లకు పైగా ఆస్తులను మరియు 2.5 లక్షలకు పైగా ఉద్యోగులను నిర్వహిస్తున్న బ్యాంకుకు నాయకత్వం వహిస్తున్న భారత టాప్ బ్యాంకర్ రజనీష్ కుమార్ జూన్ 5 న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీత భత్యాలు తగ్గిస్తే వీధుల్లో నివసించడం ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

జీతభత్యాలు తగ్గిస్తే రోడ్లమీద నివసించాలి అన్న ఎస్బీఐ చైర్మన్

జీతభత్యాలు తగ్గిస్తే రోడ్లమీద నివసించాలి అన్న ఎస్బీఐ చైర్మన్

భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఛైర్మన్ రజనీష్ కుమార్, విశ్లేషకులతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఈ వ్యాఖ్యను చేశారు. చాలా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో జీత భత్యాల కొత్త విధించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై జీతం కోత ప్రకటించిన ప్రైవేటు సహచరులను ఎస్‌బిఐ అనుసరిస్తుందా అని అడిగినప్పుడు,రజనీష్ కుమార్ ఇలా అన్నారు, "రోడ్ పే ఆకే రెహ్నా పడేగా అంటూ అలా తగ్గిస్తే నేను వీధిలో నివసించడం ప్రారంభించాలి, అసలే నాజీతం చాలా తక్కువ వస్తుంది అని ఆయన చమత్కరించారు .

ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకర్ల చెల్లింపుల మధ్య అంతరాన్ని సూచించిన వ్యాఖ్యలు

ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకర్ల చెల్లింపుల మధ్య అంతరాన్ని సూచించిన వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యను తేలికగా చేసినప్పటికీ, ఇది భారతదేశంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకర్ల చెల్లింపుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని సూచిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వార్షిక నివేదిక వెల్లడి ప్రకారం, రజనీష్ కుమార్ వార్షిక వేతనం 2019 ఆర్థిక సంవత్సరానికి రూ .29,53,750 గా ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకు ముఖ్యులకు చెల్లించే జీతభత్యాల మధ్య పూర్తి వ్యత్యాసం చాలా కాలంగా ఉంది.

బ్యాంక్ బోర్డ్ బ్యూరో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల జీతభత్యాల విషయంలో మార్పుల సూచన

బ్యాంక్ బోర్డ్ బ్యూరో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల జీతభత్యాల విషయంలో మార్పుల సూచన

పిఎస్‌బిలు ప్రధాన ప్రదేశాలలో నివాస వసతి వంటి ప్రోత్సాహకాలను పొందుతాయి. ఈ సౌకర్యాలను ప్రైవేట్ బ్యాంకులు మాత్రం తమ ఉద్యోగులకు అందించవు. అనేకమంది నిపుణులు, కమిటీలు మరియు ఇటీవల బ్యాంక్ బోర్డ్ బ్యూరో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల జీతభత్యాల విషయంలో మార్పులను సూచించాయి. అయితే ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఈ అంతరం గత కొన్నేళ్లుగా విస్తరించింది.

English summary

జీతభత్యాలు తగ్గిస్తే వీధుల్లో నివసించాలి: ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు | live on the streets: SBI Chairman Rajnish Kumar makes interesting comments on pay cuts

India's top banker, SBI Chairman Rajnish Kumar, on June 5 joked that he would have to start living on the streets if his salary is cut. Kumar, made the remark in jest during a conference call with analysts.
Story first published: Saturday, June 6, 2020, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X