For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon: మెటా, ట్విటర్‌, మైక్రోసాఫ్ట్‌ దారిలో అమెజాన్.. ఉద్యోగులు జాగ్రత్త..

|

ఆర్థిక మాంద్యం భయాలు, పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మెటా, ట్విటర్‌, మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకోగా.. తాజాగా అమెరికన్ టెక్నాలజీ, ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతవారం హైరింగ్‌ ప్రక్రియకు బ్రేక్‌ వేయనున్నట్టు అంతర్గత మెమోలో ప్రకటించిన అమెజాన్‌ ఉద్యోగులను తొలగించడంపై దృష్టి సారించింది.

3,766 మంది ఉద్యోగులు

3,766 మంది ఉద్యోగులు

అమెజాన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జామీ జాంగ్ లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తనను కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపారు. అంతేకాదు రోబోటిక్స్ టీమ్ మొత్తానికి పింక్ స్లిప్‌లు అందజేశారని మాజీ ఉద్యోగి పోస్ట్‌లో పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, కంపెనీ రోబోటిక్స్ విభాగంలో కనీసం 3,766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3,766 మంది ఉద్యోగులలో ఎంతమందిని తొలగిస్తారో తెలియదు.

వాల్ స్ట్రీట్ జర్నల్

వాల్ స్ట్రీట్ జర్నల్

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, కంపెనీ లాభాల్లో లేని యూనిట్లలో పని చేస్తున్న సిబ్బందిని వేరే చోట ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. "గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎంత మంది వ్యక్తులను నియమించుకున్నాము, ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత ప్రదేశంలో ఉన్నందున కొత్త ఇంక్రిమెంటల్ హైర్‌లను పాజ్ చేయాలని ఈ వారం నిర్ణయించుకున్నట్లు కంపెనీలో పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టీ మెమోలో పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక వ్యవస్థ

ఉద్యోగ రిక్రూట్ మెంట్ రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు."రాబోయే కొన్ని నెలల పాటు ఈ పాజ్‌ని ఉంచాలని నిర్ణయించుకున్నాం.ఆర్థిక వ్యవస్థలో మనం చూస్తున్న వాటిని పర్యవేక్షించడం కొనసాగిస్తాము " అని మెమో పేర్కొంది.

English summary

Amazon: మెటా, ట్విటర్‌, మైక్రోసాఫ్ట్‌ దారిలో అమెజాన్.. ఉద్యోగులు జాగ్రత్త.. | Like Meta, Twitter and Microsoft, another IT company, Amazon, has taken up the process of laying off employees

Many companies are laying off employees to reduce rising costs amid fears of an economic downturn. Especially IT companies are hunting their employees. Recently, there are reports that the American technology and e-commerce company Amazon is looking to reduce its costs.
Story first published: Friday, November 11, 2022, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X