For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్సురెన్స్ ప్రీమియంపై గుడ్‌న్యూస్, గడువు మే 31 వరకు పొడిగింపు

|

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో జీవిత బీమా పాలసీల పునరుద్ధరణ గడువును పెంచుతున్నట్లు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ బాడీ IRDAI తెలిపింది. మార్చి 31వ తేదీలోపు ప్రీమియం చెల్లించాల్సిన వారికి మే 31వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియంలకు 30 రోజుల పాటు అదనపు సమయం ఇస్తున్నట్లు గత మార్చి 23, ఏప్రిల్ 4వ తేదీలలో IRDAI ప్రకటించింది. ఇప్పుడు ఆ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది

హైదరాబాద్ ఐటీ కంపెనీలు ప్రారంభం, కండిషన్స్ అప్లై! కంపెనీ-ఉద్యోగులు పాటించాల్సిన రూల్స్..

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్‌ను పొడిగించినందున మార్చికి సంబంధించిన ప్రీమియంను మే 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఎవరి చేతుల్లోను డబ్బులు లేని పరిస్థితి. వేతనాలు లేక, వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాలసీ పునరుద్ధరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారికి ఎంతోమందికి భారీ ఊరటగా చెప్పవచ్చు.

 LIC policy: Grace period for premium payment extended further

కరోనా కారణంగా తొలుత లాక్ డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రకటించారు. ఆ తర్వాత మే 3వ తేదీ వరకు, అనంతరం మే 17వ తేదీ వరకు పొడిగించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary

ఇన్సురెన్స్ ప్రీమియంపై గుడ్‌న్యూస్, గడువు మే 31 వరకు పొడిగింపు | LIC policy: Grace period for premium payment extended further

Irdai, the insurance regulatory body, on Sunday said it has decided to further extended the grace period for renewal of life insurance policies whose premium was due in March till May 31 in wake of the extension of lockdown to fight spread of coronavirus.
Story first published: Monday, May 11, 2020, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X