For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ ఆఫర్: ల్యాప్స్ అయిన పాలసీ పునరుద్దరించొచ్చు.. ఎప్పటినుంచి అంటే...

|

ఏదైనా పాలసీ తీసుకుని.. నిర్ణీత సమయంలో నగదు చెల్లించకుంటే ల్యాప్స్ అవుతు ఉంటుంది. అలా అయిన పాలసీలకు కూడా తిరిగి రెన్యూవల్ చేసే ఛాన్స్ ఇస్తారు. దేశంలో అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాంటి వారికి ఆఫర్ ఇచ్చింది. వ్యక్తిగత ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారుల తిరిగి తమ పాలసీల పునరుద్దరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పిస్తోంది.

ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 25 వరకు పాలసీదారులు తిరిగి నిలిచిపోయిన పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. ఈ మేరకు ఎల్ఐసీ ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారు పెరుగుతుండటంతో ఎల్ఐసీ పాలసీదారులకు.. వారి పాలసీలను పునరుద్ధరించే ఛాన్స్ ఇచ్చారు. లైఫ్ వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఎల్ఐసీ సంస్థ వివిరించింది.

lic offer:lapsed policy will renewed

అర్హత కలిగిన ఆరోగ్య, చిన్న బీమా పథకాల పాలసీదారులు లేట్ ఫైన్‌తో రాయితీ పొందవచ్చని తెలిపింది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న కొన్ని అర్హత కలిగిన పాలసీలను మాత్రమే పునరుద్ధరించనున్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది. ఆలస్య రుసుముతో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ మాత్రం మంచి పరిణామమే.. పాలసీ తిరిగి అమల్లోకి రావడంతో.. ఆఫర్ వర్తించనుంది.

సాధారణంగా వినియోగదారులకు ఎల్ఐసీ అంటే నమ్మకం ఎక్కువ.. అందరూ మ్యాగ్జిమమ్.. ఎలాంటి సందేహాం లేకుండా పాలసీ చేస్తుంటారు. మిగతా ప్రైవేట్ కంపెనీలు వచ్చినా.. ఎల్ఐసీకి సాటి లేదు. అయితే ఎల్ఐసీలో ఇదివరకు తక్కువ ప్రీమియంతో పాలసీలు ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా పాలసీ ప్రీమియం పెరిగాయి.

English summary

ఎల్ఐసీ ఆఫర్: ల్యాప్స్ అయిన పాలసీ పునరుద్దరించొచ్చు.. ఎప్పటినుంచి అంటే... | lic offer:lapsed policy will renewed

lic offer:lapsed policy will renewed in 7th february to march 2022
Story first published: Saturday, February 5, 2022, 19:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X