LIC HFL: హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచిన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(LIC HFL) హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4 శాతం నుండి 4.4 శాతానికి పెరిగింది. దీంతో వివిధ బ్యాంకులు హోమ్ లోన్, వెహికిల్ లోన్ సహా వివిధ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అలాగే డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును పెంచుతూ వారికి శుభవార్త చెబుతున్నాయి.
అయితే పెరిగిన వడ్డీ రేటు రుణగ్రహీతలకు ఈఎంఐ భారాన్ని పెంచుతుండగా, డిపాజిటర్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆర్బీఐ రెపో రేటు కంటే ముందే వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు అనంతరం ఇది వేగవంతమైంది.

LIC HFL వడ్డీ రేటు
ఎస్బీఐ, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేటును పెంచుతున్నాయి. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా హోమ్ లోన్ వడ్డీ రేటును పెంచింది. LIC HFL హోమ్ లోన్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు పెంచింది. LIC HFL తాజాగా కీలక వడ్డీ రేటు 0.2 శాతం పెంచింది. దీంతో ఇందులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.9 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇది 13 మే 2022 నుండి అమల్లోకి వచ్చింది.

సిబిల్ 700 కంటే ఎక్కువ ఉంటే
సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉంటే వడ్డీరేటుపై 20 బేసిక్ పాయింట్ల పెంపు మాత్రమే వర్తిస్తుందని LIC HFL సీఈవో అండ్ ఎండీ విశ్వనాథ్ గౌడ్ వెల్లడించారు. ఆర్బీఐ చాలా రోజుల తర్వాత రెపో రేటును పెంచిందని, ఈ ప్రభావం రుణదాతలపై ఉంటుందని చెప్పారు. హోమ్ కోనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా నిధుల వ్యయం పెరిగి, హోమ్ లోన్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు తెలిపారు.

హోమ్ లోన్ డిమాండ్
సిబిల్ స్కోర్ 700, అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతల కోసం కేవలం 20 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయబడిందని, ఇది ఈఎంఐ పైన గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపకపోవచ్చునని చెబుతున్నారు. హోమ్ లోన్‌కు డిమాండ్ ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.