For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంచలనం: జెఫ్ బెజోస్ కొంప ముంచింది.. అతడి ప్రేయసే!

|

అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జెఫ్ బెజోస్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీకవడం ఆయన కాపురంలో చిచ్చుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీని కారణంగా ఆయన తన పాతికేళ్ల వైవాహిక జీవితానికి కూడా స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

ఇదంతా జరగడానికి కారణం జెఫ్ బెజోస్ ప్రేయసి తమ్ముడు మైఖేల్ సాంచెజ్ అని, ఆయనే బెజోస్ వ్యక్తిగత రహస్యాలు లీక్ చేశారని, వాటి ఆధారంగానే 'నేషనల్ ఎంక్వైరర్' పత్రిక కథనాన్ని ప్రచురించిందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే ఆ రహస్యాలు మైఖేల్ సాంచెజ్‌కు ఎలా తెలిశాయి? వాటిని అతడికి ఎవరు చేరవేశారు? అనే అంశంపై జరిపిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బెజోస్ కొంప ముంచింది ఎవరో కాదు, అతడి ప్రేయసి, మైఖేల్ సాంచెజ్ సోదరి అయిన లారెన్ సాంచెజ్ అని చెబుతున్నారు.

ప్రేయసే.. కొంప ముంచింది...

ప్రేయసే.. కొంప ముంచింది...

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ అత్యంత వ్యక్తిగత సమాచారం అసలు మైఖేల్ సాంచెజ్‌కు ఎలా తెలిశాయి? వాటిని అతడికి ఎవరు చేరవేశారు? అంటే.. ఎవరో కాదు, స్వయానా బెజోస్ ప్రేయసి లారెన్ సాంచెజ్‌ అని, ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని మన్‌హట్టన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నట్లు తాజాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ కథనంలో పేర్కొంది. ఇటీవల జెఫ్ బెజోస్ భారత్‌లో పర్యటించినప్పుడు కూడా అతడి వెంట ప్రియురాలు లారెన్ షాంచెజ్ కూడా ఉంది. వారిద్దరూ కలిసి ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్ ముందు ఫోటోలు కూడా దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

పాతికేళ్ల కాపురం.. మటాష్

పాతికేళ్ల కాపురం.. మటాష్

జెఫ్ బెజోస్ సతీమణి మెకంజీ. వారికి వివాహం(1993లో) అయి పాతికేళ్లు దాటింది కూడా. అయితే మాజీ యాంకర్ అయిన లారెన్ సాంచెజ్‌తో బెజోస్‌‌కు వివాహేతర సంబంధం ఉందంటూ గత ఏడాది ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. బెజోస్, లారెన్ నడుమ నడిచిన సరస సంభాషణలకు సంబంధించిన టెక్ట్స్ మెసేజ్‌లను, అతడితో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలను కూడా నేషనల్ ఎంక్వైరర్ సంపాదించింది. భర్త రాసలీలలతో తీవ్రంగా కలత చెందిన బెజోస్ భార్య మెకంజీ అతడితో తన పాతికేళ్ల కాపురానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంది. దీంతో ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రిక తన కాపురంలో నిప్పులు పోసిందని, డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ చేసిందంటూ జెఫ్ బెజోస్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

ఈ కథలో ‘మరో కోణం’ ఏమిటంటే...

ఈ కథలో ‘మరో కోణం’ ఏమిటంటే...

అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ ప్రేమాయణం కథలో మరో కోణం ఉందనే వాదనలు కూడా వినిపించాయి. బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు మాత్రమే కాదు.. ‘వాషింగ్టన్ పోస్ట్' పత్రిక యజమాని కూడా. ఈ పత్రిక తన కథనాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చాలాసార్లు ఇబ్బంది పెట్టింది, ఇరుకున పడేసింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బెజోస్‌ను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావించారు. ఈ బాధ్యతను ట్రంప్తన ఆప్తమిత్రుడు, ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రిక యజమాని అయిన డేవిడ్ పెస్కర్‌కు అప్పగించారు. దీంతో పెస్కర్ రంగంలోకి దిగి జెఫ్ బెజోస్ వ్యక్తిగత రహస్యాలన్నీ కూపీలాగడం ప్రారంభించాడు. మొత్తానికి లేటు వయసులో బెజోస్ సాగిస్తోన్న ఘాటు ప్రేమాయణం వారికి కలిసి వచ్చింది. బెజోస్ భార్య అతడి నుంచి విడిపోయాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన్ని కసిదీరా ‘జెఫ్ బోజోస్' అంటూ హేళన చేయడం గమనార్హం.

ఫెడరల్ ప్రాసిక్యూటర్ల దర్యాప్తులో...

ఫెడరల్ ప్రాసిక్యూటర్ల దర్యాప్తులో...

అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అత్యంత వ్యక్తిగత రహస్య సమాచారాన్ని ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రిక ప్రచురించిన కేసులో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వారు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించినట్లు సమాచారం. 2018 మే 10వ తేదీన బెజోస్ ప్రేయసి లారెన్ షాంచెజ్ ఫోన్ నుంచి ఆమె సోదరుడు మైఖేల్ సాంచెజ్‌ ఫోన్‌కు కొన్ని ఎస్సెమ్మెస్‌లు వెళ్లినట్లు వీరి దర్యాప్తులో తేలిందని, బెజోస్‌కు తనకు మధ్య జరిగిన సరస సంభాషణను లారెన్ తన సోదరుడికి పంపిందని ప్రాసిక్యూటర్లు సాక్ష్యాలు సంపాదించారంటూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజాగా ఓ కథనంలో పేర్కొంది. అంతేకాదు, అదే ఏడాది జూలై 3న బెజోస్‌తో తాను సన్నిహితంగా దిగిన ఫొటోలను కూడా లారెన్ సాంచెజ్ తన సోదరుడికి షేర్ చేసిందట.

బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందా?

బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందా?

మరోవైపు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉపయోగిస్తోన్న ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసిందనే వాదనలు కూడా బయటికొచ్చాయి. ఈ విషయాన్ని బెజోస్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గావిన్ డి బెకర్ గతంలోనే చెప్పారు. ఈ హ్యాకింగ్ వెనుక సౌదీ యువరాజు హస్తం కూడా ఉండవచ్చనే అనుమానాలు కూడా వెల్లువెత్తాయి. ఎందుకంటే, జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. దీంతో ఆ పత్రిక సౌదీ యువరాజు సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకుని కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో సౌదీ అధికారులు వ్యూహాత్మకంగా జెఫ్ బెజోస్‌ ఫోన్‌ను హ్యాక్ చేశారని, అతడి వ్యక్తిగత రహస్యాలను తస్కరించి, బెజోస్‌కు లారెన్ సాంచెజ్‌తో ఉన్న సంబంధాల గురించిన సమాచారాన్ని అమెరికాలోని ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రికకు అందించారని, దీంతో ఆ పత్రిక వాటిని కథనం రూపంలో వెలుగులోకి తీసుకొచ్చిందనే వాదన కూడా ఉంది.

లీకేజి వీరుడు లారెన్ సోదరుడే...

లీకేజి వీరుడు లారెన్ సోదరుడే...

అయితే తాజాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన కథనం ప్రకారం.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అత్యంత వ్యక్తిగత రహస్య సమాచారం అతడి ప్రేయసి లారెన్ సాంచెజ్ సోదరుడు మైఖేల్ సాంచెజ్ ద్వారానే లీకైందని తెలుస్తోంది. అతడికి చెప్పింది కూడా ఎవరో కాదని, అతడి సోదరి లారెన్ అని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, ట్రంప్ ఇన్నర్ సర్కిల్‌లో మైఖేల్ సాంచెజ్ ఒక సభ్యుడని, బెజోస్ అతడి ప్రేయసి లారెన్ మధ్య ఉన్న సంబంధాల గురించి స్వయంగా మైఖేల్ సాంచెజ్ బట్టబయలు చేశాడని, ఆ సమాచారాన్ని ‘నేషనల్ ఎంక్వైరర్' పత్రికకు 2 లక్షల డాలర్లకు విక్రయించాడని తేలింది. ఇదీ సంగతి! మొత్తానికి అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడి కొంప అతడి ప్రేయసే ముంచిందన్నమాట!!

English summary

సంచలనం: జెఫ్ బెజోస్ కొంప ముంచింది.. అతడి ప్రేయసే! | lauren sanchez revealed jeff bezos secrets to her brother

Federal prosecutors in Manhattan have evidence indicating Jeff Bezos ’ girlfriend provided text messages to her brother that he then sold to the National Enquirer for its article about the Amazon.com Inc. founder’s affair.
Story first published: Sunday, January 26, 2020, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X