For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేటీఆర్‌కు సుందర్ పిచాయ్ థ్యాంక్స్, ఎందుకో తెలుసా?

|

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF)కు హాజరైన తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దావోస్ సదస్సులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తోను ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కస్టమర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ యూజర్ల కోసంకస్టమర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ యూజర్ల కోసం

కేటీఆర్‌కు సుందర్ పిచాయ్ అభినందనలు

హైదరాబాదులో గూగుల్ సేవల విస్తరణ అంశంపై పిచాయ్‌తో కేటీఆర్ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం 2020ని కృత్రిమ మేధ (artificial intelligence) నామ సంవత్సరంగా ప్రకటించడం పట్ల కేటీఆర్‌కు పిచాయ్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం విస్తరణకు గూగుల్ సహకరించాలని కేటీఆర్ కోరారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

కేటీఆర్ పలువురు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కలిశారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. జపాన్‌కు చెందిన టాకెడా సంస్త టీకాల వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజీవ్, ప్రముఖ ఆటోమేషన్ సంస్థ రాక్‌వెల్ చైర్మన్, సీఈవో బ్లేక్ డిమోరేట్, బీఏఈ సిస్టమ్‌స్పిక్ చైర్మన్ రోజల్ కార్, కేపీఎంజీచైర్మన్, సీఈవో బిల్ థామస్ తదితరులతో భేటీ అయ్యారు. వారితో ఫార్మా సిటీలో పెట్టుబడులు, ఆటోమేషన్ విస్తరణ వైమానిక రంగం అంశాల గురించి మాట్లాడారు.

ఆనంద్ మహీంద్రాతో..

హెచ్‌సీఎల్ టెక్ కళ్యాణ్ కుమార్, ఐడియా సీఈవో శాండీ స్పైచర్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ కే గోయెంకా, ఆనంద్ మహీంద్రా తదితరులతోను చర్చించారు. కేటీఆర్‌ను స్విస్, యూకే టీఆర్‌ఎస్‌ ఎన్నారై సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నారై పాలసీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి అన్నిరంగాల్లోనూ తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ పెవిలియన్

దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దావోస్ పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండేలా ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌ను పలువురు ప్రముఖులు సందర్శించారు. దీనిలో రిసెప్షన్ ఏరియాతోపాటు రెండు మీటింగ్ హాల్స్, వెయిటింగ్ ఏరియా, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వర్చువల్ రియాలిటీ ప్రెజెంటేషన్ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారంతోపాటు హైదరాబాద్‌ నగర చరిత్రను, తెలంగాణలోని పర్యాటకరంగ విశేషాలను అందుబాటులో ఉంచారు. దావోస్‌లో మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీహబ్ సీఈవో రవినారాయణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా పెవిలియన్లు ఏర్పాటు చేశాయి.

English summary

కేటీఆర్‌కు సుందర్ పిచాయ్ థ్యాంక్స్, ఎందుకో తెలుసా? | KTR meets Google CEO Sundar Pichai at WEF

IT and Industries Minister KTR held a series of bilateral meetings with global industry leaders at the Telangana Pavilion, on the sidelines of World Economic Forum in Davos on January 22, 2020.
Story first published: Thursday, January 23, 2020, 8:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X