For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రబ్బర్‌వుడ్: తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు

|

హైదరాబాద్: తెలంగాణలో రబ్బర్‌వుడ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో నిర్వహించిన ఇండియా - థాయ్‌లాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్ వర్కింగ్ సెమినార్‌కు కేటీఆర్, థాయ్ ఉప ప్రధాని జురిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ థాయ్ ప్రతినిధులను కోరారు. సమాచారం లైఫ్ సైన్సెస్.. ఇలా వివిధ రంగాల్లో హైదరాబాద్ ముందుందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి స్థానంలో నిలిచిందన్నారు.

5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కష్టమే, ఇలా అసాధ్యమేమీ కాదు: మోడీ కలపై గడ్కరీ5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కష్టమే, ఇలా అసాధ్యమేమీ కాదు: మోడీ కలపై గడ్కరీ

KT Rama Rao invites Thai firms to invest in Telangana

రబ్బర్‌వుడ్, టింబర్‌వుడ్‌ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉందని, రవాణా సబ్సిడీ అందిస్తామని కేటీఆర్ థాయ్‌లాండ్ కంపెనీలకు హామీ ఇచ్చారు. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, దేశవృద్ధిరేటు కంటే ఎక్కువ అభివృద్ధిని రాష్ట్రం నమోదు చేసిందన్నారు.

తెలంగాణలో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. బ్యాంకాక్- హైదరాబాద్ మధ్య విమాన సర్వీసుల్ని పెంచి పర్యాటకరంగం అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో థాయ్‌లాండ్ సహకారాన్ని తీసుకోవడంతో పాటు వివిధ రంగాల్లో కలిసి పని చేస్తామన్నారు.

English summary

రబ్బర్‌వుడ్: తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు | KT Rama Rao invites Thai firms to invest in Telangana

With an aim to transform Telangana into a hub for business establishments, Minister for IT and Industries KT Rama Rao on Saturday urged a group of delegates from Thailand, headed by Deputy Prime Minister Jurin Laksanawisit, to set up their units at the proposed furniture park in the city.
Story first published: Sunday, January 19, 2020, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X