For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Multibagger: లక్ష పెట్టుబడిని రూ.5.5 కోట్లు చేసిన మల్టీబ్యాగర్.. తాజాగా సూపర్ ప్రాఫిట్స్..

|

Bank Multibagger: ఇప్పటి వరకు మనం ఎక్కువగా కెమికల్స్, ఫ్యాషన్, డిఫెన్స్, తయారీ రంగాల్లోని అనేక కంపెనీలు మల్టీబ్యాగర్ రాబడును అందించటం చూశాం. అయితే బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి స్టాక్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. చాలా కాలంగా క్వాలిటీ సర్వీసెస్ తో పాటు గ్రోత్ కూడా అందిస్తున్న బ్యాంకింగ్ స్టాక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గడచిన రెండు దశాబ్దాల్లో ఇన్వెస్టర్లను లక్షాధికారులను ఎలా కోటీశ్వరులుగా మార్చిందో గమనిద్దాం.

కంపెనీ వివరాలు.

కంపెనీ వివరాలు.

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా గురించి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఈ బ్యాంక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. పైగా ఇదొక చక్కటి డివిడెండ్ స్టాక్ కావటం చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షించటానికి మరో కారణమని చెప్పుకోవాలి. 2008 నుంచి వరుసగా ప్రతి ఏటా కంపెనీ షేర్ హోల్డర్లకు డివిడెండ్ చెల్లిస్తూనే ఉంది. ఈ స్టాక్ గడచిన రెండు సంవత్సరాల కాలంలో 60 శాతం రాబడిని అందించింది.

లక్షను కోట్లుగా మార్చు..

లక్షను కోట్లుగా మార్చు..

రెండు దశాబ్దాల కిందట ఈ స్టాక్ ధర రూ.6.88 వద్ద ఉంది. అప్పట్లో ఎవరైనా వ్యక్తి లక్ష రూపాయలు కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి, దానిని ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే అతనికి 14,534 షేర్లకు 500 రెట్లు రాబడి వచ్చేది. గత శుక్రవారం స్టాక్ ఎన్ఎస్ఈ ముగింపు ధర రూ.1,905 వద్ద ఉంది. ఈ లెక్కన షేర్లను ఇప్పుడు అమ్మిఉంటే అతను రూ.5.5 కోట్ల కంటే ఎక్కువ మెుత్తాన్ని పొంది ఉండేవాడు. అందుకే ఆర్థిక నిపుణులు ఎల్లప్పుడూ పెట్టుబడుల విషయంలో దీర్ఘాకాలం ఇన్వెస్ట్ మెంట్స్ అనేవి.. మంచి రాబడులను సరైన మార్గంగా సూచిస్తుంటారు.

మార్కెట్ క్యాప్..

మార్కెట్ క్యాప్..

దేశంలో అగ్రగామి ప్రైవేటు బ్యాంక్ గా కొనసాగుతున్న కోటక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.3.78 లక్షల కోట్లుగా ఉంది. 2003లో స్థాపించబడిన ఈ బ్యాంక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర ఎన్ఎస్ఈ ప్రకారం రూ.1,631గా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాలా గరిష్ఠ ధర రూ.2,253 వద్ద ఉంది.

బ్యాంక్ తాజా లాభాలు..

బ్యాంక్ తాజా లాభాలు..

కోటక్ మహీంద్రా బ్యాంక్ శనివారం సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. Q2 ఫలితాల్లో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.2,580.68 కోట్లకు చేరుకుంది. కిందటి ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.2,032.01 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ త్రైమాసిక ఫలితాల్లో నికర వడ్డీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 26 శాతం పెరిగి రూ.5,099 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ ద్వారా నిధుల సమీకరణను పరిశీలిస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ వారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

English summary

Bank Multibagger: లక్ష పెట్టుబడిని రూ.5.5 కోట్లు చేసిన మల్టీబ్యాగర్.. తాజాగా సూపర్ ప్రాఫిట్స్.. | Kotak Mahindra Bank Gave Multibagger Returns Turned One Lakh To 5 Crores

Kotak Mahindra Bank Gave Multibagger Returns Turned One Lakh To 5 Crores
Story first published: Monday, October 24, 2022, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X