For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: ఒక వ్యాపార ఆలోచన.. రూ.48,000 కోట్ల కంపెనీని నిర్మించింది..

|

Success Story: ఆధునిక యుగంలో అన్ని సేవలూ టెక్నాలజీ వినియోగంతో వేగంగా ముదుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో క్యాబ్ బుక్ చేసుకునే ఉంటాం. క్యాబ్ అనగానే సహజంగా మానకు ఓలా కంపెనీ పేరు మదిలో తడుతుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ క్యాబ్ సర్వీస్ తో పాటు ఆటోరిక్షాలు, బైక లను కూడా అద్దెకు ఇస్తోంది. దేశంలో ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు కంపెనీకి దాదాపు 10-11 సంవత్సరాల కాలం పట్టింది. అయితే దీని ప్రారంభం నుంచి విజయం వరకు వెనుక ఉన్న విజయగాథను మనం తప్పక తెలుసుకోవాలి.

పంజాబ్ లో పుట్టి..

పంజాబ్ లో పుట్టి..

ఓలా విజయగాథ పంజాబ్ లోని లూథియానా నివాసి భవిష్ అగర్వాల్ తో ప్రారంభమైంది. భవిష్ ముంబై ఐఐటీలో విద్యను అభ్యసించి మైక్రోసాఫ్ట్‌లో పనిచేశారు. మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, భవిన్ తన స్వంత సాంకేతిక సమాచార వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఈ వెబ్‌సైట్‌కు దేశీ టెక్.ఇన్ అని పేరు పెట్టాడు. ఈ వెబ్‌సైట్‌ దేశంలోని సాంకేతిక రంగంలో సరికొత్త స్టార్టప్‌ల గురించి సమాచారాన్ని అందించేందుకు ఉపయోగించబడతాయి.

ప్రయాణంలో చేదు అనుభవం..

ప్రయాణంలో చేదు అనుభవం..

ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి వారాంతపు యాత్రకు టాక్సీ బుక్ చేసుకున్నారు. ఈ బుకింగ్‌ను బెంగళూరు నుంచి బందీపూర్‌కు ప్రయాణించేందుకు చేసుకున్నారు. అకస్మాత్తుగా మైసూర్‌లో టాక్సీని ఆపి, ప్రయాణ ఖర్చులు భరించలేనని చెప్పి అదనంగా డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించాడు డ్రైవర్. అయితే అక్కడ భవిష్ కూడా ఉన్నాడు. వారు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేరు. అప్పుడు వారిని వదిలి టాక్సి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇలాంటి పరిస్థితి సామాన్యులకు ఎదురైతే ఎలా ఉంటుందో అని ఆలోచించారు భవిష్.

ఉద్యోగం మానేసి..

ఉద్యోగం మానేసి..

భవిష్‌కు టెక్నాలజీపై చాలా ఆసక్తి ఉండటంతో.. అతని మనసులో ఓ ఆలోచన వచ్చింది. అలా అతనికి అద్దె కార్ల గురించి ఆలోచన వచ్చింది. భవిష్ తన ఆలోచనను కుటుంబ సభ్యులకు చెప్పగా, కుటుంబ సభ్యులు అదొక పిచ్చి ఆలోచన అంటూ ఎగతాళి చేశారు. కానీ భవిష్ ఎవరి మాట వినలేదు. ఆ తర్వాత 2010లో మంచి సంపాదనను ఇస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలి తన స్నేహితుడు అంకిత్ భాటియాతో కలిసి ఓలా కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఓలా దాదాపుగా 15 లక్షల మందికి పైగా ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ రూ.48 వేల కోట్ల విలువైన కంపెనీగా రూపాంతరం చెందింది.

English summary

Success Story: ఒక వ్యాపార ఆలోచన.. రూ.48,000 కోట్ల కంపెనీని నిర్మించింది.. | Know success story of Bhavish agarwal who started Ola leaving Microsoft Job

Know success story of Bhavish agarwal who started Ola leaving Microsoft Job
Story first published: Tuesday, December 13, 2022, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X