For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPI Payments: యూపీఐ యూజర్స్ బి అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై లిమిట్స్ ఇవే..

|

UPI Payments: ప్రస్తుత కాలంలో భౌతికంగా కరెన్సీ వాడే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. దేశంలో డిజిటలైజేషన్ మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకుంటున్న తరుణంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ చెల్లింపు సంస్థలు రోజువారీ ట్రాన్సాక్షన్ మెుత్తంపై పరిమితులు పెట్టాయి. ఒకేసారి ఎంత డబ్బు డిజిటల్ గా పంపవచ్చు లేదా స్వీకరించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 లావాదేవీలకు పరిమితులు..

లావాదేవీలకు పరిమితులు..

దేశంలోని యూపీఐ చెల్లింపు ఫిన్ టెక్ కంపెనీలతో పాటు బ్యాంకులు సైతం వివిధ రోజువారీ పరిమితులు ఉన్నాయి. అయితే ఈ చెల్లింపులకు ప్రస్తుతం ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయటం లేదు. NPCI మార్గదర్శకాల ప్రకారం ఒకరోజులో గరిష్ఠంగా రూ.లక్ష వరకు లావాదైవీలు చేసుకోవచ్చు. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ పరిమితిని రూ.25,000, ఎస్‌బీఐ రూ.లక్ష వరకు రోజువారీ లావాదేవీల పరిమితిని అందిస్తున్నాయి. అలాగే రోజువారీ ట్రాన్సాక్షన్ల సంఖ్యపై కూడా లిమిట్ ఉంది.

 అమెజాన్ పే..

అమెజాన్ పే..

Amazon Pay UPI ద్వారా చెల్లింపులు చేయడానికి రోజువారీ గరిష్ఠ పరిమితి రూ.లక్షగా ఉంది. ఎవరైనా యూజర్ కొత్తగా అమెజాన్ పే లో కొత్తగా నమోదు చేసుకున్నప్పుడు మెుదటి 24 గంటల్లో కేవలం రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్స్ చేసేందుకు మాత్రమే పరిమితి ఉంది. మరోవైపు బ్యాంకును బట్టి రోజుకు 20 లావాదేవీలు జరుపుకునేందుకు వెసులుబాటును అమెజాన్ పే అందిస్తోంది.

ఫోన్ పే..

ఫోన్ పే..

PhonePe UPI ద్వారా ఒక రోజులో గరిష్ఠంగా యూజర్ లక్ష రూపాయల వరకు లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇప్పుడు యాప్ ద్వారా ఒక రోజులో 10 లేదా 20 ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు అనుమతి ఉంది. PhonePe గంటవారీ లావాదేవీ పరిమితులను ఏర్పాటు చేయలేదు.

 గూగుల్ పే..

గూగుల్ పే..

భారతీయ వినియోగదారులకు అత్యంత వేగంగా చేరువైన UPI చెల్లింపుల ఫ్లాట్ ఫారమ్ Google Pay. ఇది కూడా తన కస్టమర్లకు ప్రత్యర్థి కంపెనీల మాదిరిగానే రోజుకు రూ.లక్ష వరకు చెల్లింపులు చేసుకునేందుకు అనుమతిస్తోంది. అయితే రోజుకు కేవలం 10 లావాదేవీలు చేసుకునేందుకు మాత్రమే ఫిన్ టెక్ సంస్థ అనుమతిస్తోంది. అయితే గంటల వారీగా లావాదేవీల విషయంలో ఎలాంటి పరిమితులను ప్రస్తుతం పెట్టలేదు.

 పేటీఎం..

పేటీఎం..

"పేటీఎం కరో" అంటూ ప్రజలకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అత్యంత వేగంగా చేరువచేసిన కంపెనీగా పేటీఎం మంచి పేరు సంపాదించుకుంది. దేశంలో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో పేటీఎం పెద్ద బూమ్ చూసింది. అప్పుడు కంపెనీ తన తొలినాళ్ల ప్రయాణాన్ని మెుదలు పెట్టింది. ప్రస్తుతం కంపెనీ లాభదాయకంగా మారేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇది కూడా రోజుకు రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. పేటీఎం ద్వారా వినియోగదారులు గంటకు రూ.20,000 వరకు గరిష్ఠంగా చేసేందుకు అనుమతిస్తోంది. అలా గంటలో ఐదు లావాదేవీలు రోజు మెుత్తంలో 20 లావాదేవీలు మాత్రమే చేసేందుకు కంపెనీ ప్రస్తుతం అనుమతిస్తోంది.

English summary

UPI Payments: యూపీఐ యూజర్స్ బి అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై లిమిట్స్ ఇవే.. | Know restriction on UPI payments in a day by PhonePe, Gpay, Amazon Pay, Paytm

Know restriction on UPI payments in a day by PhonePe, Gpay, Amazon Pay, Paytm
Story first published: Thursday, January 19, 2023, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X