For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sahara India: సహారా ఇండియాలో మీ డబ్బు ఇరుక్కుందా.. అయితే ఈ వార్త మీకోసమే..

|

Sahara Group: సహారా గ్రూప్ గురించి తెలియని వారు ఉండరన్నది అతిశయోక్తి కాదు. ఎందుకంటే రెండు దశాబ్దాల కిందట చాలా మంది చిన్న పొదుపరులు తమ డబ్బును అధిక రాబడుల కోసం ఈ కంపెనీలో డిపాజిట్ల రూపంలో పెట్టుబడి పెట్టారు. అయితే ఆ తర్వాత కంపెనీ ఏమైందో మనందరికీ తెలిసిందే. అలా ఈ కంపెనీలో చాలా మంది డబ్బు చిక్కుకుపోయింది. దానిని తిరిగిపొందేందుకు ఉన్న మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిఫండ్..

రిఫండ్..

సహారా ఇండియా రీఫండ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. మీ డబ్బును తిరిగి పొందటానికి SEBI లేదా కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌ని సంప్రదించాలి. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ నుంచి దీనికి సంబంధించిన ఫిర్యాదు చేయవచ్చు. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నుంచి క్లెయిమ్ చేయవచ్చు.

దశాబ్ద కాలంలో..

దశాబ్ద కాలంలో..

గడచిన 10 ఏళ్ల కాలంలో సహారా ఇండియా పరివార్‌కు చెందిన రెండు కంపెనీల ఇన్వెస్టర్లకు 2012 నుంచి ఇప్పటి వరకుో సెబీ రూ.138 కోట్లను రీఫండ్ చేసింది. తిరిగి చెల్లింపు కోసం ప్రత్యేకంగా సెబీ తెరిచిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.24,000 కోట్లకు పైగా పెరిగాయి. కాబట్టి ఫిర్యాదు ద్వారా ఇరుక్కుపోయిన డబ్బును తప్పకుండా వెనక్కి పొందటానికి అవకాశం ఉంటుంది.

సహాయం కోసం..

సహాయం కోసం..

SEBI నుంచి ఈ విషయంలో సహాయం పొందడానికి ఎవరైనా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సంప్రదించవచ్చు. ఇందుకోసం 18002667575 లేదా 1800227575 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చు. అక్కడ మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఆన్ లైన్ ఫిర్యాదు..

ఆన్ లైన్ ఫిర్యాదు..

ఆన్ లైన్ ఫిర్యాదు కోసం ముందుగా మీరు వినియోగదారుల హెల్ప్‌లైన్ https://consumerhelpline.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యూజర్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అక్కడ మీ ఫిర్యాదును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మీ కంప్లెయింట్ రిజిస్టర్ అయినట్లు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. అది మీ ఈ-మెయిల్ ఐడీకి కూడా పంపబడుతుంది. ఆ తర్వాత త్వరలోనే దానిని సెబీ పరిష్కరిస్తుంది.

English summary

Sahara India: సహారా ఇండియాలో మీ డబ్బు ఇరుక్కుందా.. అయితే ఈ వార్త మీకోసమే.. | Know how to file complaint To get Money Refund Strucked in sahara Companies

Know how to file complaint To get Money Refund Strucked in sahara Companies
Story first published: Friday, November 4, 2022, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X