For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేట్ల పెంపు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందా..? ఇన్వెస్టర్ల రూట్ మ్యాప్ ఇదే..

|

Stocks Vs FD: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దిగ్గజ కంపెనీల వృద్ధిపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ దక్షిణాసియాలోని కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో పక్క మాంద్యం ఉన్నప్పటికీ భారత ఆర్థికానికి పెద్ద ముప్పు ఉండదని వెల్లడైంది.

రూటు మారుస్తున్న ఇన్వెస్టర్స్..

రూటు మారుస్తున్న ఇన్వెస్టర్స్..

ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్ కొంచెం అనుకూలమైన మార్జిన్‌ను కలిగి ఉంది. దీంతో అంతర్జాతీయ దేశాల దృష్టి భారత్ వైపు మళ్లింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు మెుగ్గుచూపుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు మరిన్ని పశ్చిమ దేశాలు మాంద్యంలో ఇబ్బంది పడుతున్నాయి.

రిటైల్ ఇన్వెస్టర్స్..

రిటైల్ ఇన్వెస్టర్స్..

దేశీయ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం తమ నమ్మకాన్ని కోల్పోకుండా పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల రూపంలోనూ దేశీయ పెట్టుబడిదారులు తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే మాంద్యం భయాలు ముదురుతున్న తరుణంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు, పెట్టుబడి వ్యూహాలు మారుతున్నాయి.

వడ్డీ రేట్ల పెంపుతో..

వడ్డీ రేట్ల పెంపుతో..

భారత రిజర్వు బ్యాంక్ వరుసగా నాలుగు సార్లు వడ్డీ రేట్లను 1.90% పెంచటంతో చాలా మంది సురక్షిత పెట్టుబడుల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్లలోకి తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది తమ డబ్బును స్టాక్ మార్కెట్లకు బదులు డెట్ ఇన్ట్రుమెంట్లలో అంటే బాండ్స్ మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ల పతన సమయంలో ఇవి మెరుగైన రిటర్న్స్ అందిస్తాయి.

ఇంట్రెస్ట్‌ని పెంచాలనే ఆలోచన ఉంది

ఇంట్రెస్ట్‌ని పెంచాలనే ఆలోచన ఉంది

రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో వడ్డీ రేటు పెరుగుతూనే ఉంది. దీంతో రుణాలపై వడ్డీ కూడా పెరుగుతోంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాలని బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచగా, చాలా వరకు వెనకడుగు వేస్తున్నాయి.

ఇది స్టాక్ మార్కెట్స్..? ఫిక్స్ డ్ డిపాజిట్..?

ఇది స్టాక్ మార్కెట్స్..? ఫిక్స్ డ్ డిపాజిట్..?

అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయంలో బ్యాంకులు పెట్టుబడిదారులకు మంచి వడ్డీ రేట్లతో ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొంత తక్కువ రిటర్న్స్ వచ్చినా క్యాపిటల్ సేఫ్ ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే అనేక మంది బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం కంటే.. బ్యాంక్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని భావిస్తున్నారు.

అప్పుల కోసం పెరిగిన డిమాండ్..

అప్పుల కోసం పెరిగిన డిమాండ్..

అప్పుల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున బ్యాంకులు లాభాలను ఆర్జించడం కొనసాగించవచ్చు. దీని వల్ల భారతీయ బ్యాంకులు మంచి వృద్ధిని సాధిస్తాయి. అయితే వడ్డీ రేట్ల పెంపు ఆకర్షినీయంగా ఉన్నప్పటికీ.. అది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను పూర్తి స్థాయిలో ప్రభావితం చేయదని తెలుస్తోంది. అయితే కొందరు రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు మాత్రం తమ పెట్టుబడులను తాత్కాలికంగా ఎఫ్డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లిస్తారని నిపుణులు భావిస్తున్నారు.

English summary

వడ్డీ రేట్ల పెంపు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందా..? ఇన్వెస్టర్ల రూట్ మ్యాప్ ఇదే.. | know how rising interest rates imapcting indian stock markets in detail

know how rising interest rates imapcting indian stock markets in detail
Story first published: Saturday, October 22, 2022, 7:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X