For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Futures & Options: ఫ్యూటర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

|

Futures & Options: మనలో చాలా మందికి కేవలం ఈక్విటీ మార్కెట్లలో షేర్ల క్రయవిక్రయాల గురించి మాత్రమే తెలుసు. కానీ చాలా మంది వీటికి తోడు డెరివేటివ్ ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాకులను వివిధ భవిష్యత్ ధరలకు కొనుగోలు లేదు అమ్మటం చేయటం అన్నమాట. వీటిలో పరిమితులతో పాటు ప్రయోజనాలు ఈక్విటీ మార్కెట్ల కంటే భిన్నంగా ఉంటాయి. అందుకే కొత్తగా మార్కెట్లోకి వచ్చే ట్రేడర్స్ వీటికి సంబంధించిన ప్రాథమిక అంశాల గురించి తప్పక తెలుసుకోవాలి.

 ఫ్యూచర్స్ ట్రేడింగ్..

ఫ్యూచర్స్ ట్రేడింగ్..

ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ఎవరైన పెట్టుబడిదారులు స్టాక్స్ లేదా కమోడిటీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ కాంట్రాక్టులను ఒప్పందం గడువులోగా పూర్తి చేసుకోవాల్సి(ట్రేడింగ్ సెటిల్మెంట్) ఉంటుంది. ఇక ఫ్యూచర్స్ సెల్లర్స్ విషయంలో హోల్డర్ స్థానం ముందుగా మూసివేయబడితే తప్ప.. నిర్దిష్ట భవిష్యత్తు తేదీకి ముందే దాన్ని తిరిగి కొనుగోలు చేయాలి. ఈ క్రమంలో లాభం వచ్చే చాన్స్ ఎంత ఎక్కువ ఉంటుందో నష్టం వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. ఇందులో ట్రేడర్ ముందుగా స్టాక్ మార్కెట్ నిర్ణయించిన మార్జిన్ మనీని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒప్పందం చేసుకున్న ఫ్యూచర్ రేటు పెరిగే లాభం.. తగ్గితే నష్టం వస్తుంది.

CALL కొనటం..

CALL కొనటం..

ఉదాహరణకు ఎవరైనా ఇన్వెస్టర్ ఒక కంపెనీ గురించి, దాని షేర్ల పనితీరు గురించి బాగా అధ్యయనం చేశాడనుకుందాం. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత అతడు కంపెనీపై సానుకూలంగా ఉండి.. భవిష్యత్తులో కంపెనీ షేర్ల ధర పెరుగుతుందని భావించినట్ల అనుకుందాం. ఇలాంటి సదర్భంలో అతడు ఒక చేరుతుందనుకున్న ధర స్ట్రైక్ ప్రైస్ వద్ద కాల్ కొంటాడు. దానికోసం నిర్ధేశించిన ప్రీమియం చెల్లిస్తాడు. ట్రేడింగ్ సమయంలో రేటు అతని స్ట్రైక్ ప్రైస్ రీచ్ అయితే లాభం వస్తుంది. లేని పక్షంలో అతడు చెల్లించిన ప్రీమియం మాత్రమే నష్టపోతాడు.

CALL అమ్మటం..

CALL అమ్మటం..

ఉదాహరణకు ఇన్వెస్టర్ స్టాక్ పనితీరు గమనించి అది తగ్గుతుందని భావించినప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ వద్ద సదరు ఆప్షన్ ను విక్రయిస్తాడు. దీనికి అతడు ప్రీమియంను కూడా పొందుతాడు. అతడు ఎంచుకున్న స్ట్రైక్ ధర కంటే తక్కువ ధరకు ట్రేడింగ్ జరిగితే నష్టపోవటానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రీమియం సొమ్ముకు పైన వచ్చే నష్టమే నిజమైన నష్టం. పైగా ఇక్కడ నష్టానికి ఎలాంటి హద్దులు ఉండవు కాబట్టి సదరు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి.

PUT కొనుగోలు..

PUT కొనుగోలు..

'పుట్ ఆప్షన్' అనేది ఇద్దరు ఆసక్తిగల పార్టీలు అంతర్లీనంగా ఉన్న ధర ఆధారంగా లావాదేవీలోకి ప్రవేశించడానికి అంగీకరించే ఒప్పందం. ప్రీమియం చెల్లించడానికి అంగీకరించే పార్టీని 'కాంట్రాక్ట్ కొనుగోలుదారు' అని, ప్రీమియం పొందే పార్టీని 'కాంట్రాక్ట్ విక్రేత' అని పిలుస్తారు. ప్రీమియం చెల్లించే వ్యక్తి హక్కును కొనుగోలు చేస్తాడు. కాంట్రాక్ట్ విక్రేత ప్రీమియంను స్వీకరించి తనకు తాను బాధ్యత వహిస్తాడు. ధర పడిపోతే కొద్ది కాంట్రాక్ట్ కొన్న వ్యక్తికి లాభం వస్తుంది.

 PUT అమ్మటం..

PUT అమ్మటం..

పుట్ ఆప్షన్‌ను అమ్మడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. నిఫ్టీ కోసం ఒక విక్రేత 18,500 పుట్ ఆప్షన్‌ను విక్రయించి, ప్రీమియంగా రూ. 350 వసూలు చేస్తారని బావిద్దాం. ఈ సందర్భంలో స్పాట్ ధర 18,500 కంటే ఎక్కువ ఉన్నంత కాలం.. ప్రీమియం అతని లాభం అవుతుంది. స్పాట్ ధర కంటే తక్కువకు ఆప్షన్ ధర పడిపోయినప్పుడు మాత్రమే నష్టం వస్తుంది.

Read more about: futures options trading derivatives
English summary

Futures & Options: ఫ్యూటర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. | Know How Futures & Options trading mechanism works in stock markets to make money

Know How Futures & Options trading mechanism works in stock markets to make money
Story first published: Thursday, January 5, 2023, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X