For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Best Multibaggers: మంచి రాబడినిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్స్.. మీ దగ్గర కూడా ఉన్నాయా..?

|

Best Multibaggers: 2022లో చాలా కంపెనీలు అత్యుత్తమ పనితీరుతో తమ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించాయి. ఈ క్రమంలో కొన్ని స్టాక్స్ ఏకంగా 1000 శాతం రాబడిని ఇచ్చాయి. ప్రస్తుతం బులిష్ మెుమెంటం కొనసాగిస్తున్న స్టాక్స్ రానున్న కాలంలో మరింత పెరగవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. బెస్ట్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన 5 కంపెనీల షేర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్..

SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్..

టెక్స్‌టైల్ రంగంలో స్మాల్ క్యాప్ కంపెనీగా ఉన్న SEL మాన్యుఫ్యాక్చరింగ్ మార్కెట్ క్యాప్ రూ.2,315 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ 2022లో ఇన్వెస్టర్లకు బంపర్ రాబడులను అందించింది. అలా ఇన్వెస్టర్లకు ఏకంగా 14,021 శాతానికి పైగా బలమైన రాబడులను అందించింది. జనవరిలో కేవలం రూ.44గా ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ.680 వద్ద ఉంది.

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్..

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్..

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ లేబుల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, మ్యాగజైన్‌లు, కార్టన్‌లను ప్రింట్ చేస్తోంది. ఈ స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్ ఏడాదిలో 13,900 శాతం భారీ రాబడిని ఇచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.309 కోట్లుగా ఉంది. ప్రస్తుత మార్కెట్‌లో ఒక్కో షేరు ధర రూ.56.50గా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.130గా ఉంది.

రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..

రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..

రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఇన్వెస్టర్లకు ఏడాదిలో 1570% రాబడిని అందించింది. కంపెనీ పాలిస్టర్ టెక్చరైజ్డ్ నూలు, ఓరియంటెడ్ నూలు, పూర్తిగా గీసిన నూలు తయారుచేస్తోంది. రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర వరుసగా రూ.34గా ఉంది.

అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..

అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..

అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చింది. స్టాక్‌లో స్థిరమైన పెరుగుదలను నమోదు చేసింది. స్టాక్ పెట్టుబడిదారులకు 2,905 శాతం రాబడిని ఇచ్చింది. 1992లో స్థాపించబడిన అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ అహ్మదాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తోంది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో అంకుర్ రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్, అంకుర్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అంకుర్ రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, అంకుర్ రిఫైన్డ్ కార్న్ ఆయిల్ ఉన్నాయి.

ప్రస్తుత మార్కెట్ ధర రూ.549గా ఉంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.843 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.15గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.262.20 కోట్లుగా ఉంది.

సెజల్ గ్లాస్ లిమిటెడ్..

సెజల్ గ్లాస్ లిమిటెడ్..

స్మాల్ క్యాప్ రంగంలోని ఈ కంపెనీ 1998లో స్థాపించబడి గ్లాస్ సెక్టార్‌లో పనిచేస్తోంది. ఈ రోజు కంపెనీ దేశంలోని కస్టమర్ల అవసరాలు, సౌకర్యాలు, ప్రాధాన్యతలను నిరంతరం అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.238 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ స్టాక్ ఈ ఏడాది పెట్టుబడిదారులకు దాదాపు 1,638 శాతం రాబడిని ఇచ్చింది.

English summary

Best Multibaggers: మంచి రాబడినిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్స్.. మీ దగ్గర కూడా ఉన్నాయా..? | Know About top 5 multibaggers in 2022 that gave investors best returns

Know About top 5 multibaggers in 2022 that gave investors best returns
Story first published: Saturday, December 10, 2022, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X