For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loss Making Startup's: భారీ నష్టాల్లో ఉన్న టాప్-10 స్టార్టప్స్ ఇవే.. ఎన్ని వేల కోట్లు ఆవిరిచేసాయంటే..

|

Loss Making Startup's: ఆలోచన ఉంటే చాలు దానిని ఆచరణలోకి తీసుకురావటమే స్టార్టప్ కల్చర్ అంటే. వ్యాపార ధృక్పదం ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు అనేక కంపెనీలు, పెట్టుబడి సంస్థలు బయట అందుబాటులో ఉన్నాయి.

స్టార్టప్‌ల హబ్ గా భారత్..

స్టార్టప్‌ల హబ్ గా భారత్..

ఈ ఏడాది మే నెలలో భారత్ 100 యునికార్న్‌లకు నిలయంగా మారింది. స్టార్టప్‌ల హబ్‌గా నిలిచింది. ఆగస్టులో 20 స్టార్టప్‌లు యునికార్న్ హోదాను సాధించాయి. ఈ స్టార్టప్‌ల విలువ 341 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త పెట్టుబడులకు సంస్థలు ముందుకు రానప్పటికీ.. ఈ కంపెనీలు మాత్రం బయటి నుంచి దాదాపు 94 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించగలిగాయి.

నష్టాల ఊబి..

నష్టాల ఊబి..

ఘనమైన కంపెనీల ప్రస్థానం వెనుక వేలకోట్ల అప్పుల కుప్పలు ఉన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం దేశంలో ఆదరణ పొందిన భారతీయ యునికార్న్ స్టార్టప్‌లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

నష్టాల్లో ఉన్న టాప్-10 స్టార్టప్స్ ఇవే..

నష్టాల్లో ఉన్న టాప్-10 స్టార్టప్స్ ఇవే..

1. బైజూలు: రూ.4,588 కోట్లు

2. OYO: రూ.3,944 కోట్లు

3. ఉడాన్: రూ.2,482 కోట్లు

4. ఫ్లిప్‌కార్ట్: రూ.2,446 కోట్లు

5. ఎరుడిటస్: రూ.1,934 కోట్లు

6. PhonePe: రూ.1,728 కోట్లు

7. Paytm: రూ.1,710 కోట్లు

8. స్విగ్గీ: రూ.1,617 కోట్లు

9. అనాకాడెమీ: రూ.1,537 కోట్లు

10. ఫ్రెష్‌వర్క్‌లు: రూ.1,499 కోట్లు

త్వరలో ఐపీవోకి రానున్న కంపెనీలు..

త్వరలో ఐపీవోకి రానున్న కంపెనీలు..

యునికార్న్ కంపెనీలు త్వరలో ఐపీవోల రూపంలో మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే జొమాటో, పేటీఎం వంటి టెక్నాలజీ ఆధారిత కంపెనీలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. వాటి పనితీరు చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరు నగరం యూనికార్న్‌లకు కేంద్రంగా ఉంది. రెండవ స్థానంలో ఢిల్లీ-NCR నిలిచింది. ముంబై, చెన్నై, పూణె, హైదరాబాద్‌లు ఏకంగా 32 యునికార్న్‌లను ఉత్పత్తి చేశాయి.

ఉద్యోగుల తొలగింపులు..

ఉద్యోగుల తొలగింపులు..

ఎడ్టెక్ స్టార్టప్ వేదాంటు 2022లో మూడోసారి 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్ లైన్ రిటైల్ సెల్లింగ్ ప్లాట్ ఫామ్ మీషో కిరాణా వర్టికల్ సూపర్‌స్టోర్‌ను మూసివేసిన తర్వాత దాదాపు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. అగ్రిటెక్ స్టార్టప్ DeHaat ఇటీవల గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.

English summary

Loss Making Startup's: భారీ నష్టాల్లో ఉన్న టాప్-10 స్టార్టప్స్ ఇవే.. ఎన్ని వేల కోట్లు ఆవిరిచేసాయంటే.. | know about top 10 Indian loss making unicorn startups that evaporated crores of amount

know about top 10 Indian loss-making unicorn startups that evaporated crores of amount
Story first published: Monday, September 19, 2022, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X