For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..

|

Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారం ప్రారంభించటం అంటే మాటలు కాదు. దానికి వెనుక ఎన్ని అవరోధాలు, ఆటుపోట్లు, కష్టాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. అదీ ఒక మహిళ విషయానికి వస్తే సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పుకోవాలి. చిన్న వ్యాపారంగా మెుదలై వేల కోట్ల వరకు జరిగిన ఒక మహిళ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్వదేశం నుంచి విదేశాల వరకు..

స్వదేశం నుంచి విదేశాల వరకు..

ఈ రోజు మనం VU TV గురించి మాట్లాడుతున్నాము. ఇది TV అనే పదం నిర్వచనాన్నే మార్చేసింది. దీని ఘనత VU TV CEO, వ్యవస్థాపకురాలు, హెడ్ ఆఫ్ డిజైన్ అయిన దేవితా సరాఫ్‌కు చెందుతుందని చెప్పుకోక తప్పదు. సాధారణంగా ఏ మంచి టెక్నాలజీ అయినా విదేశాల్లో తయారై భారత్‌కు రావడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ.. ఈసారి సీన్ రివర్స్ అయింది. ఈ మహిళ స్థాపించిన కంపెనీ మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అద్భుతాలను సృష్టిస్తోంది.

తాతగారి నుంచి వ్యాపార నైపుణ్యాలు..

తాతగారి నుంచి వ్యాపార నైపుణ్యాలు..

దేవితా ముంబైలో నివసిస్తోంది. ఆమె తండ్రి జెనిత్ కంప్యూటర్స్ ఛైర్మన్. అయితే ఆమె తన తాత నుంచి వ్యాపార నైపుణ్యాను నేర్చుకున్నట్లు చెప్పింది. ముంబయి నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత, ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నుంచి BBA డిగ్రీ పూర్తి చేసింది. భారత్ కు తిరిగి వచ్చిన తరువాత దేవితా తండ్రి కంపెనీలో చేరింది.

లగ్జరీ టెలివిజన్ల పరిచయం..

లగ్జరీ టెలివిజన్ల పరిచయం..

2006లో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో విదేశీ కంపెనీలు మొబైల్, కంప్యూటర్ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. దేవితా కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం టీవీని ఎంచుకుని ఆవిష్కరణలు చేయాలనుకుంది. విలాసవంతమైన టెలివిజన్‌ల శ్రేణి అయిన VU టెక్నాలజీస్‌ని పరిచయం చేసింది. ఈ టీవీ డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌తో పాటు టచ్ స్క్రీన్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్‌లను కూడా దీనిద్వారా టీవీలో రన్ చేయవచ్చు. ఆమె కంపెనీ ఆండ్రాయిడ్‌తో పనిచేసే హై డెఫినిషన్ టీవీలను కూడా ప్రస్తుతం తయారు చేస్తోంది.

కంపెనీ వాల్యుయేషన్ ఇలా..

కంపెనీ వాల్యుయేషన్ ఇలా..

దేవితా సరాఫ్ ఇంత చిన్న వయస్సులోనే వ్యాపారంలో అవసరమైన సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకుంటూ సాధించిన విజయాల రికార్డు నిజంగా స్ఫూర్తిదాయకమని చెప్పుకోవాల్సిందే. VU ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ కస్టమర్లతో కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.110 కోట్లకు చేరుకుంది. కంపెనీ వాల్యుయేషన్ దాదాపుగా రూ.1,200 కోట్ల కంటే ఎక్కువగానే ఉంది.

దేవితాకు అవార్డులు..

దేవితాకు అవార్డులు..

ఆఫీస్ స్మార్ట్, పాప్‌స్మార్ట్ వంటి అనేక కొత్త టీవీలను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. 2016 సంవత్సరంలో దేవితా తన ఉత్తమ పనితీరుతో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది. నిజంగా ఒక మహిళ తన నైపుణ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చటం ప్రశంశించదగినదే. ఇంత పోటీ ప్రపంచంలో, అది కూడా రోజుకో టెక్నలజీ పుట్టుకొస్తున్న తరుణంలో అత్యుతమ పనితీరుతో కంపెనీని ముందుకు తీసుకెళ్లటం అంత ఈజీ కాదన్న సంగతి మనందరికీ తెలిసిందే.

English summary

know about success story of devitha Saraf a women lead UV tv company leading world

know about success story of devitha Saraf a young women
Story first published: Saturday, August 13, 2022, 19:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X