For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakesh Jhunjhunwala: 34 స్టాక్‌లలో జున్‌జున్‌వాలా రూ.29,301 కోట్ల పెట్టుబడి.. ఏ కంపెనీల వాటాలు అమ్మేశారంటే..

|

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లలో ప్రముఖ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోను అనుసరించే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఉంటారు. రిటైల్ పెట్టుబడిదారులను అనుసరించడానికి ప్రేరేపించే అంశం ఏమిటంటే.. పెద్ద ఇన్వెస్టర్ల స్టాక్‌లను ఎంచుకోవచ్చు. ఎందుకంటే బడా ఇన్వెస్టర్లు కంపెనీ ప్రాథమిక అంశాలు, భవిష్యత్తు వ్యాపార అవకాశాలను అంచనా వేయగలరు కాబట్టి. రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త. ఆయనకు దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 34 కంపెనీల్లో పెట్టుబడులు..

34 కంపెనీల్లో పెట్టుబడులు..

జున్‌జున్‌వాలాను భారత వారెన్ బఫ్ఫెట్‌గా పిలుస్తుంటారు. తన స్వంత పెట్టుబడి పోర్ట్‌ఫోలియోతో పాటు తన అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ RaRe ఎంటర్‌ప్రైజెస్ క్రింద ఒక పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నారు. కొత్త నివేదిక ప్రకారం.. 34 స్టాక్‌లలో పెట్టుబడుల నికర విలువ రూ.29,301 కోట్లుగా ఉంది. జూన్ ఆర్థిక త్రైమాసికంలో మార్కెట్‌లో చాలా అస్థిరత కనిపించగా.. జున్‌జున్‌వాలా తన పోర్ట్‌ఫోలియోలో చేసిన కీలక మార్పులను ఇప్పుడు గమనిద్దాం..

నాల్కో తగ్గిన పెట్టుబడులు..

నాల్కో తగ్గిన పెట్టుబడులు..

నాల్కో తక్కువ ఖర్చుతో కూడిన మార్గాల ద్వారా అల్యూమినియం, ఖనిజాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ. జూన్ త్రైమాసికంలో నాల్కోలో జున్‌జున్‌వాలా వాటా 1 శాతం కంటే తక్కువకు తగ్గినట్లు తాజా ఫైలింగ్‌లు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు మార్చి త్రైమాసికంలో ఆయన నాల్కోలో 1.36 శాతం వాటాను లేదా 2,50,00,000 షేర్లను కలిగి ఉన్నారు.

డెల్టా కార్పొరేషన్..

డెల్టా కార్పొరేషన్..

డెల్టా కార్ప్ అనేది వివిధ రకాల ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, హోటల్ వ్యాపారాలను నిర్వహించే సంస్థ. జూన్ త్రైమాసికంలో జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ కంపెనీలో తమ వాటాను క్రమంగా తగ్గించుకున్నారు. దీంతో వారిద్దరి షేర్ హోల్డింగ్ ఈ కంపెనీలో తగ్గింది. అంతకుముందు.. మార్చి త్రైమాసికంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జున్‌జున్‌వాలా, ఆయన భార్య డెల్టాలో 7.48 శాతం లేదా 2.5 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.

టాటా మోటార్స్..

టాటా మోటార్స్..

టాటా మోటార్స్ దేశీయ గ్లోబల్ ఆటోమొబైల్ తయారీదారు. ఏప్రిల్-జూన్ కాలంలో ఈ అత్యంత విభిన్నమైన ఆటోమొబైల్ స్టాక్ నుంచి రాకేష్ జున్‌జున్‌వాలా పాక్షికంగా వైదొలిగినట్లు చూడవచ్చు. అతను జూన్ త్రైమాసికంలో టాటా మోటార్స్ కు చెందిన 30,00,000 షేర్లను విక్రయించారు. దీంతో కంపెనీలో జున్‌జున్‌వాలా వాటా 1.09 శాతానికి లేదా 36,250,000 షేర్లకు పడిపోయింది.

ఎస్కార్ట్స్ కుబోటా..

ఎస్కార్ట్స్ కుబోటా..

ప్రముఖ ట్రాక్టర్ తయారీదారు ఎస్కార్ట్స్ కుబోటాలో జున్‌జున్‌వాలా 1.39 శాతం లేదా 18,30,388 షేర్లను కొనుగోలు చేశారు. అంతకుముందు జనవరి-మార్చి కాలంలో కంపెనీ కీలక పెట్టుబడిదారుల జాబితాలో జున్‌జున్‌వాలా పేరు లేదు. అంటే.. రాకేష్ జున్‌జున్‌వాలా ఏప్రిల్-జూన్ మధ్ కాలంలో ఎస్కార్ట్స్ లో తాజాగా పెట్టుబడి పెట్టారు.

 ఈ కంపెనీల్లో వాటాను స్థిరంగా కొనసాగింపు..

ఈ కంపెనీల్లో వాటాను స్థిరంగా కొనసాగింపు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో.. రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడులు కలిగి ఉన్న కొన్ని షేర్లలో ఎటువంటి మార్పు లేదు. ఆనంద్ రాజ్, ఆగ్రో టెక్, కెనరా బ్యాంక్, క్రిసిల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఇండియన్ హోటల్స్, జూబిలెంట్ ఫార్మా, మ్యాన్ ఇన్‌ఫ్రా, ఓరియంట్ సిమెంట్, ప్రోజోన్ ఇంటూ, ర్యాలీస్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్, టైటాన్ కంపెనీ, వాటెక్ వాబాగ్, వోకార్ట్, బిల్‌కేర్, మెట్రో బ్రాండ్స్ , జూబిలెంట్ ఇంగ్రావియా కంపెనీల్లో వాటాలను బిగ్ బుల్ అలాగే కొనసాగిస్తున్నారు.

మార్పులు జరిగింది ఈ కంపెనీల్లోనే..

మార్పులు జరిగింది ఈ కంపెనీల్లోనే..

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో.. కొన్ని కంపెనీలు అమలు చేస్తున్న కార్పొరేట్ విధానాల కారణంగా వాటి స్టాక్‌లలో జున్‌జున్‌వాలా వాటా స్వల్పంగా మారింది. ఎన్‌సీసీ, ఆటోలైన్ ఇండస్ట్రీస్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆప్టెక్ వంటి కంపెనీల్లో షేర్ హోల్డింగ్ మార్పు.. కార్పొరేట్ విధానాల మార్పు కారణంగా జరిగింది.

English summary

Rakesh Jhunjhunwala: 34 స్టాక్‌లలో జున్‌జున్‌వాలా రూ.29,301 కోట్ల పెట్టుబడి.. ఏ కంపెనీల వాటాలు అమ్మేశారంటే.. | know about latest changes in between april to june quarter of Rakesh Jhunjhunwala

know about latest changes in between april to june quarter of Rakesh Jhunjhunwala portfolio and investment pattern..
Story first published: Sunday, July 24, 2022, 7:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X