i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inspirational Story: SBIలో స్వీపర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ స్థాయికి.. అద్బుతమైన తల్లిగా..

|

Inspirational Story: SBIలో స్వీపర్‌గా చేరిన ప్రతీక్ష టోండ్‌వాల్కర్‌ అనే మహిళా ఉద్యోగి.. ఇప్పుడు అదే బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ స్థాయికి ఎదిగింది. ఆమె విజయాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చే ఇంగ్లీష్ కొటేషన్.. Those who work hard never give up!. అవుని ఇది ఆమె జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది. పూణేకు చెందిన ప్రతీక్షా టోండ్‌వాల్కర్‌ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమైనదో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లీనర్‌గా చేరిన ప్రతీక్ష ప్రస్తుతం ఎస్‌బీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కానీ.. స్వీపర్ స్థాయి నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరకు ఆమె కలల ప్రయాణం అంత సులభమైనది కాదు. పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడటంతో ఆమె కలలు నిజమయ్యాయి. అయితే ప్రతీక్షకు ఇదంతా ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఆమె జీవిత ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం... రండి..

పెళ్లి వల్ల నిలిచిన చదువు..

పెళ్లి వల్ల నిలిచిన చదువు..

నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు అప్పటి సామాజిక వ్యవస్థ, అప్పటి కట్టుబాట్ల ప్రకారం త్వరగానే వివాహం జరిగింది. 1964లో జన్మించిన ప్రతీక్ష తన 17 ఏళ్ల వయసులో 1981లోనే పెళ్లి చేసుకుంది. ఇంట్లో పరిస్థితుల కారణంగా 7వ తరగతి వరకు చదివిన ప్రతీక్ష ఈ పెళ్లిలో కూరుకుపోయింది. భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బైండర్‌గా పనిచేస్తున్నాడు.

భర్త మరణంతో స్వీపర్ గా..

కానీ.. ఆమె భర్త 1984లో మరణించడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. పరిస్థితులకు భయపడకుండా తన భర్త పనిచేస్తున్న ఎస్‌బీఐ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేయడం ప్రారంభించింది. తాత్కాలిక ఉద్యోగం వచ్చిన ప్రతీక్ష.. ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించింది. ఎందుకంటే తర్వాతి స్థానం, పర్మినెంట్ ఉద్యోగం రావాలంటే చదువు ఒక్కటే మార్గమని ప్రతీక్షకు తెలుసు కాబట్టి.

10వ తరగతి పాసై..

10వ తరగతి పాసై..

చదువును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిక్ష పగలు, రాత్రి పనితో పాటు చదివి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత బ్యాంకులో మెసెంజర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమె పని చేస్తూనే తన విద్యను కొనసాగించింది. SNDT కళాశాల నుంచి పట్టభద్రురాలయింది. కొంతకాలం తర్వాత.. ఆమెకు బ్యాంకులోనే గుమస్తా ఉద్యోగం వచ్చింది.

క్లర్క్ నుంచి మేనేజర్ స్థాయితి..

క్లర్క్ నుంచి మేనేజర్ స్థాయితి..

క్లర్క్‌గా ఉన్న ప్రతీక్ష ఇంటర్నల్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ట్రైనీ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అధికారి పోస్టుకు చేరుకోవడానికి ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. దీని తర్వాత ప్రతీక్ష నేరుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిగ్రీని పొందారు. త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్‌లో AGM పోస్ట్‌లో పనిచేయనున్నారు. అలా ఒకప్పుడు స్వీపర్‌గా ఉన్న స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ప్రతీక్ష కథ నేటి తరాలకు నిజంగా స్ఫూర్తిదాయకం.

పిల్లల భవిష్యత్తును అద్బుతంగా మలిచిం..

పిల్లల భవిష్యత్తును అద్బుతంగా మలిచిం..

ప్రతిక్ష ఈ కలలు నెరవేర్చుకునే ప్రయాణంలో ఎంతో కష్టపడింది. అయితే ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ సమయంలో ఆమె తన కుటుంబ బాధ్యతలను కూడా ధీటుగా నిర్వర్తిచింది. ప్రతీక్షకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముంబై నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ పూర్తి చేసిన తరువాత, అతని కుమారుడు వినాయక్ ఐఐటీ పోవై నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.

ఆ తర్వాత పూణెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి పొజిషన్‌లో కూడా పనిచేస్తున్నాడు. ఆమె కుమార్తె దీక్ష బేకర్, మరో కుమారుడు ఆర్య ప్రస్తుతం చదువుతున్నాడు. అందుకే ప్రతీక్ష తన సొంత పనులపైనే కాన్సంట్రేట్ చేస్తూనే ఇంటి బాధ్యతలు కూడా చూసుకుని పిల్లల భవిష్యత్తును అద్బుతంగా మలిచింది. జీవితంలో పట్టుదల, కష్టపడితే అనుకున్నది సాధించవచ్చనేది ప్రతీక్ష జీవిత ప్రయాణం మనందరికీ తెలియజేస్తుంది.

English summary

know about inspirational story of pratiksha tondwalker from sweeper to AGM at mumbai branch

know about inspirational story of pratiksha tondwalker who joined sbi as sweeper and became assistant general manager at mumbai branch.
Story first published: Sunday, July 3, 2022, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X