For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ghost Railway Station: ఈ దెయ్యాల రైల్వేస్టేషన్ గురించి తెలుసా..? 42 ఏళ్లు మూతబడి చివరికి ఏమైందంటే..

|

Ghost Railway Station: కేవలం ఒక్క అమ్మాయి వల్ల రైల్వే స్టేషన్‌ మూతపడుతుందా..? ఇది చాలా వింతగా అనిపిస్తున్నప్పటికీ అక్షరాలా జరిగిన వాస్తవం. కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే అందులో ప్రయాణికుల రాకపోకలు సాగాయి. ఇది వినగానే మీరు దీనిని ఒక జోక్ అనుకోవచ్చు. కానీ.. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉంది. దీని పేరు బెగుంకోదర్ రైల్వే స్టేషన్.

రైల్వే స్టేషన్ 1960లో ప్రారంభం..

రైల్వే స్టేషన్ 1960లో ప్రారంభం..

సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని రాంచీ డివిజన్‌లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ 1960లో ప్రారంభమైంది. సంతాల్ రాణి లచన్ కుమారి దీన్ని తెరవడంలో కీలకపాత్ర పోషించారు. ఈ స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత కొన్నాళ్లపాటు అంతా బాగానే ఉన్నా.. తర్వాత ఇక్కడ కొన్ని వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. 1967లో బెగుంకోదర్‌కు చెందిన ఒక రైల్వే ఉద్యోగి స్టేషన్‌లో ఒక మహిళ దెయ్యాన్ని చూసినట్లు పేర్కొన్నాడు. అలాగే అతను అదే స్టేషన్‌లో రైలు ప్రమాదంలో మరణించినట్లు ప్రచారం కూడా జరిగింది. మరుసటి రోజు ఆ రైల్వే ఉద్యోగి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పినా వారు పట్టించుకోలేదు.

చనిపోయిన స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం..

చనిపోయిన స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం..

అప్పటి బెగుంకోదర్ స్టేషన్ మాస్టర్, అతని కుటుంబం రైల్వే క్వార్టర్స్‌లో శవమై కనిపించడంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. ఈ మరణాలకు అదే దెయ్యం ప్రమేయం ఉందని అప్పట్లో అక్కడ నివసించిన వారు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత స్టేషన్ మీదుగా ఏదైనా రైలు దాటినప్పుడల్లా.. ఆ రైలు వెంట దెయ్యం పరుగెత్తేదని చెప్పారు. కొన్నిసార్లు దెయ్యం రైలు కంటే వేగంగా పరిగెత్తడం ద్వారా దానిని అధిగమించేదని వారు తెలిపారు. ఇది కాకుండా రైలు ముందు పట్టాలపై దెయ్యం డ్యాన్స్ చేస్తుందని కూడా చాలాసార్లు ప్రచారం జరిగింది.

దెయ్యాల రైల్వే స్టేషన్‌గా ట్యాగ్..

దెయ్యాల రైల్వే స్టేషన్‌గా ట్యాగ్..

ఈ భయానక సంఘటనల తరువాత.. బేగుంకోదర్ దెయ్యాల రైల్వే స్టేషన్‌గా పరిగణించబడుతోంది. ఇది రైల్వే రికార్డుల్లో కూడా నమోదు చేయబడింది. ఈ మహిళ దెయ్యం భయం ప్రజల్లో ఎంతగా పెరిగిపోయిందంటే.. వారు ఈ స్టేషన్‌కు రావడానికి భయపడేవారు. క్రమంగా ఇక్కడికి రావడం, వెళ్లడం మానేశారు. స్టేషన్‌లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు కూడా భయంతో పారిపోయారు. బేగంకోదర్ స్టేషన్‌లో రైల్వే ఉద్యోగిని ఎప్పుడు నియమించినా వెంటనే ఇక్కడికి రావడానికి నిరాకరిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ స్టేషన్‌లో రైళ్లు కూడా ఆగడం లేదు. ఎందుకంటే భయంతో ఏ ప్రయాణీకుడు కూడా ఇక్కడ దిగడానికి ఇష్టపడలేదు లేదా రైలు ఎక్కడానికి ఎవరూ ఈ స్టేషన్‌కు రావటం లేదు. దీని తరువాత 1967 నుంచి స్టేషన్ మొత్తం నిర్జనమై మూసివేయబడింది.

రైల్వే బోర్డుకు చేరిన వార్త..

రైల్వే బోర్డుకు చేరిన వార్త..

ఈ స్టేషన్‌లోని దెయ్యం చర్చ పురూలియా జిల్లా నుంచి కోల్‌కతా వరకు ఆపై రైల్వే మంత్రిత్వ శాఖకు కూడా చేరిందని అంటున్నారు. ఆ సమయంలో ఈ స్టేషన్‌ మీదుగా రైలు వెళ్లినప్పుడల్లా లోకో పైలట్లు స్టేషన్‌కు రాకముందే రైలు వేగాన్ని పెంచేవారని, తద్వారా వీలైనంత త్వరగా ఈ స్టేషన్‌ను దాటించేవరాని అక్కడివారు చెబుతున్నారు. రైలులో కూర్చున్న వారు కూడా స్టేషన్‌కి వచ్చే ముందు కిటికీలు, తలుపులు అన్నీ మూసేసేవారట.

42 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ స్టేషన్‌ను తిరిగి ప్రారంభించారు..

42 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ స్టేషన్‌ను తిరిగి ప్రారంభించారు..

అయితే.. ఈ స్టేషన్‌ను మూసివేసిన 42 సంవత్సరాల తర్వాత 2009లో, గ్రామస్తుల కోరిక మేరకు, అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ స్టేషన్‌ను మరోసారి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్‌లో దెయ్యం కనిపించినట్లు ఎటువంటి ఘటనలు చోటుచేసుకోలేదు. కానీ ఇప్పటికీ ప్రజలు సూర్యాస్తమయం తర్వాత స్టేషన్‌లో ఆగరు. కరోనా కాలానికి ముందు దాదాపు 10 రైళ్లు ఆ స్టేషన్‌లో ఆగేవి. అనేక సార్లు పర్యాటకులు కూడా ఈ స్టేషన్‌ను సందర్శించేవారు. అలా ఇది దెయ్యాల రైల్వే స్టేషన్‌గా ప్రసిద్ధి చెందింది.

Read more about: railway
English summary

Ghost Railway Station: ఈ దెయ్యాల రైల్వేస్టేషన్ గురించి తెలుసా..? 42 ఏళ్లు మూతబడి చివరికి ఏమైందంటే.. | know about India's Ghost Railway Station Which Was Closed For 42 Years in begunkondar of west bengal

know about ghost railway station in west bengal state
Story first published: Friday, June 24, 2022, 11:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X