For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కియా సోనెట్ కారు వేరియంట్లు, ధరలు ఎంతంటే ?

|

సౌత్ కొరియా వాహన దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో తన కాంపాక్ట్ SUV సోనెట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.71 లక్షల నుండి రూ.11.99 లక్షల వరకు ఉంది. అత్యంత పోటీ ఉండే ఈ విభాగంలోకి కియా మోటార్స్.. సోనెట్‌తో అడుగు పెట్టింది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడువు ఉండే ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంది. హ్యుండాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా మోటార్స్ నెక్సాన్, హోండా డబ్ల్యువీఆర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటివి ఈ విభాగాల్లో ఉన్నాయి.

17 వేరియంట్లు. రూ.6.71 లక్షల నుండి

17 వేరియంట్లు. రూ.6.71 లక్షల నుండి

కియో మోటార్స్ సోనెట్ కారు 17 వేరియంట్లలో లభ్యం అవుతుంది. రెండు పెట్రోల్, రెండు డీజిల్ ఇంజిన్, అయిదు ట్రాన్స్‌మిషన్, రెండు లెవల్స్‌తో కలిసి పదిహేడు వేరియంట్లలో ఉంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.71 లక్షల నుండి రూ.11.99 లక్షల మధ్య ఉంది. డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.05 లక్షల నుండి రూ.11.99 లక్షల మధ్య ఉంది.

25వేల బుకింగ్స్

25వేల బుకింగ్స్

కియా మోటార్స్ సోనెట్ కారుకు 25,000 బుకింగ్స్ వచ్చాయి. ఆగస్ట్ 20వ తేదీ నుండి అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం సరఫరా వైపు ఎలాంటి సమస్యలు లేవని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని కియా మోటార్స్ ప్లాంట్‌లో రెండో షిఫ్టుల్లో ఉత్పత్తిని ప్రారంభించినట్లు కియా మోటార్స్ తెలిపింది. తొలి ఏడాది దేశీయ మార్కెట్లో లక్ష సోనెట్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విదేశాలకు 50,000 యూనిట్లు ఎగుమతి చేయాలని భావిస్తోంది. 70కి పైగా దేశాలకు కంపెనీ ఈ కారును ఎగుమతి చేయనుంది.

ఫీచర్స్..

ఫీచర్స్..

కియో సోనెట్ ద్వారా 33 కొత్త ఇండస్ట్రీ ఫస్ట్ ఫ్యూచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఐదు ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నట్లు తెలిపింది. కొత్త కారు కొనుగోలుదారులకు ఎయిర్ ప్యూరిఫయర్ ముఖ్యమైన ఎంపికగా మారుతున్నాయి. కియా సోనెట్ సెల్టోస్ నుండి ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ వైరస్ నుండి రక్షణ పొందేలా ఉంటుంది.

English summary

కియా సోనెట్ కారు వేరియంట్లు, ధరలు ఎంతంటే ? | Kia Sonet compact launched at Rs 6.71 lakh

On Friday, Kia Motors India entered the subcompact SUV segment (under 4 metres in length) by launching the Sonet-available with the widest variety in its category in terms of powertrains and trims.
Story first published: Saturday, September 19, 2020, 13:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X