For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bumper IPO: అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే బంపర్ లాభాలు.. భవిష్యత్తు బంగారమే..

|

Kaynes Technology IPO: చాలా కాలం తర్వాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం జరుగుతోంది. అయితే వీటిలో చాలా ఐవీవోలు ప్రారంభం నుంచే దూకుడుగా ఇన్వెస్టర్లకు డబ్బును సంపాదించిపెడుతున్నాయి. అలా ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయిన కేన్స్ టెక్నాలజీ ఇన్వెస్టర్లకు ఊహించని లాభావలను అందించింది.

ప్రీమియం లిస్టింగ్..

ప్రీమియం లిస్టింగ్..

ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కేన్స్ టెక్నాలజీ షేర్లు ఈరోజు దేశీయ మార్కెట్ సూచీల్లో విజయవంతంగా లిస్ట్ అయ్యాయి. భారీ ఒడిదొడుకుల్లో అరంగేట్రం చేసిన ఐపీవో మార్కెట్ అస్థిరతలను పక్కనబెట్టి మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో స్టాక్ తన ఇష్యూ ధర అయిన రూ.587 కంటే 32 శాతం ప్రీమియంతో లిస్ట్ చేయబడింది.

NSE-BSE..

NSE-BSE..

ప్రీమియం ధరకు లిస్ట్ అయిన స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.778 వద్ద, బీఎస్ఈలో రూ.775 వద్ద తన ట్రేడింగ్ ప్రారంభించింది. గడచిన నెలరోజుల్లో దాదాపు అరడజను కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి తీసుకురాగా అందులో విజయవంతంగా నిలిచిన వాటిలో ఇది కూడా ఒకటి. మైసూరుకు చెందిన కంపెనీ రూ.858 కోట్ల IPO 34.16 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

కేన్స్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా కర్ణాటక, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎనిమిది మ్యానుఫ్యాక్షరించ్ కేంద్రాలను కలిగి ఉంది. FY21లో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీ మార్కెట్ దాదాపు రూ.2.65 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఇది FY26లో రూ.9,96,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అందువల్ల కంపెనీ వ్యాపారానికి భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతున్నందున

కంపెనీ బలం..

కంపెనీ బలం..

కంపెనీ ముఖ్య బలం దాని పోర్ట్‌ఫోలియోతో కూడిన విభిన్న వ్యాపార నమూనా, పరిశ్రమ నిలువు , ప్రత్యేకించి రక్షణ, మార్క్యూ కస్టమర్ బేస్‌తో దీర్ఘకాలిక సంబంధాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు వ్యాపారాన్ని మరింతగా పెంచుతుందని తెలుస్తోంది.

వ్యాపార విస్తరణ..

వ్యాపార విస్తరణ..

ఐపీవో ద్వారా సమీకరించిన సొమ్మును రుణాల చెల్లింపుతో పాటు మైసూరు, మనేసర్ లలోని ఉత్పత్తి కేంద్రాలను విస్తరించేందుకు వినియోగించాలని నిర్ణయించింది. వీటికి తోడు చామరాజనగర్ (కర్ణాటక)లో కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉపయోగిస్తుంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ సామర్థ్యాన్ని విస్తరించే దిశగా ప్లాన్ చేసిన ఇంక్రిమెంటల్ క్యాపెక్స్ భవిష్యత్తులో రాబడిని జోడించడానికి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి వెల్లడించారు.

English summary

Bumper IPO: అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే బంపర్ లాభాలు.. భవిష్యత్తు బంగారమే.. | Kaynes Technology IPO debuted bumper listing in markets at premium

Kaynes Technology IPO debuted bumper listing in markets at premium
Story first published: Tuesday, November 22, 2022, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X