For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 నుండి కళ్యాణ్ జ్యువెల్లర్స్ IPO, ఉద్యోగులకు బంపరాఫర్!

|

కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఐపీవో మార్చి 16వ తేదీన ప్రారంభమవుతోంది. రూ.1,175 కోట్ల మేర ఐపీవోకు వస్తోంది. మంగళవారం ప్రారంభమయ్యే ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రైస్ బ్రాండ్ రూ.86 నుండి రూ.87 మధ్య ఉండవచ్చు. మార్చి 18వ తేదీన ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా రూ. 1,175 కోట్లు సమీకరించనుందని, లాట్ సైజ్ 172 షేర్లుగా ఉంటుందని, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మూడు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్ ఉంటుందని కంపెనీ వ్యవస్థాపకులు కళ్యాణరామన్ తెలిపారు.

<strong>అలా రుణం తీసుకున్న వారికి షాక్, బేస్ రేటు పెంచిన SBI</strong>అలా రుణం తీసుకున్న వారికి షాక్, బేస్ రేటు పెంచిన SBI

ప్రమోటర్ వాటా ఎంతంటే

ప్రమోటర్ వాటా ఎంతంటే

యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ మార్చి 15వ తేదీన ప్రారంభమవుతోంది. IPOలో భాగంగా కొత్తగా రూ.800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ప్రమోటర్లు రూ.375 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్ కళ్యాణరామన్ రూ.125 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రూ.250 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 9 నాటికి సంస్థలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌కు 67.99 శాతం వాటాలున్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఇండియా షేర్లకు సంబంధించి గ్రే మార్కెట్ యాక్టివిటీ కనిపించలేదు.

ఉద్యోగులకు బంపరాఫర్

ఉద్యోగులకు బంపరాఫర్

35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)కి 50 శాతానికి మించి కేటాయింపులు లేవు. ఇన్వెస్టర్లు కనీసం 172 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయవచ్చు. లాట్ కనీస మొత్తం రూ.14,964. అర్హత కలిగిన ఉద్యోగులకు రూ.2 లక్షల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేశారు. అర్హత కలిగిన ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.8 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఉద్యోగుల రిజర్వేషన్ పోర్షన్‌లో ఈ సౌకర్యం ఉంది.

వర్కింగ్ క్యాపిటల్, ఇతర అవసరాల కోసం

వర్కింగ్ క్యాపిటల్, ఇతర అవసరాల కోసం

IPO ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, కంపెనీకి సంబంధించిన ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ఐపీవోకి సంబంధించిన పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కంపెనీ దాఖలు చేయగా, అక్టోబర్ నెలలో అనుమతులు వచ్చాయి. యాక్సిస్ క్యాపిటల్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు ఈ ఐపీవోకి బుక్ రన్నింగ్ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

English summary

16 నుండి కళ్యాణ్ జ్యువెల్లర్స్ IPO, ఉద్యోగులకు బంపరాఫర్! | Kalyan Jewellers ₹1,175 crore IPO to open on March 16

Kalyan Jewellers India’s Rs 1,175 crore initial public offering (IPO) will open for subscription on March 16, 2021, at a price band of Rs 86-87 per share of face value of Rs 10 each. The public issue will close for subscription on March 18, 2021.
Story first published: Friday, March 12, 2021, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X