For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంకు అకౌంట్ తప్పనిసరి కాదు

|

జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంకు అకౌంట్ తప్పనిసరి కాదని ప్రభుత్వం శనివారం వెల్లడించింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్స్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వర్గాలకు సులభ జీవన మార్గాలను అన్వేషిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా పదవీ విరమణ చేసినవారు, పెన్షన్‌దారులతో సహా అన్ని వర్గాల జీవన సౌలభ్యం కోసం ప్రయత్నిస్తోందన్నారు.

పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగి తన నియంత్రణకు మించిన కారణాలతో తన జీవిత భాగస్వామితో జాయింట్ ఖాతాను తెరవడం సాధ్యం కాదని, అధికారి సంతృప్తి చెందితే అవసరాన్ని బట్టి సడలింపు ఉంటుందని తెలిపారు. కుటుంబ పెన్షన్ క్రెడిట్ కోసం జీవిత భాగస్వామి (ఫ్యామిలీ పెన్షనర్) ప్రస్తుత జాయింట్ బ్యాంకు ఖాతాను ఎంచుకుంటే కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు పట్టుబట్టకూడదని కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ను పంపిణీ చేసే అన్ని బ్యాంకులకు సూచించారు.

Joint Bank Account Not Mandatory For Spouse Pension

జాయింట్ బ్యాంకు ఖాతాను తెరవడానికి కారణం కుటుంబ పెన్షన్ ఆలస్యం కాకుండా ఉండటం కోసమని, అలాగే పెన్షన్‌దారు నష్టపోకుండా ఉండేందుకని పేర్కొన్నారు. కుటుంబ పెన్షన్ ప్రారంభించేందుకు అభ్యర్థనను సమర్పించేటప్పుడు కుటుంబ పెన్షనర్‌కు కనీస డాక్యుమెంటేషన్‌ను కూడా ఇది నిర్దారిస్తుంది.

English summary

జీవిత భాగస్వామి పెన్షన్ కోసం జాయింట్ బ్యాంకు అకౌంట్ తప్పనిసరి కాదు | Joint Bank Account Not Mandatory For Spouse Pension

Joint bank account is not mandatory for spouse pension, the government said on Saturday. Union Minister of State for Personnel, Public Grievances and Pensions Jitendra Singh said the Narendra Modi government has always sought "ease of living" for all sections of society including retirees and pensioners who are the nation's assets with all their experience and long years of service rendered by them.
Story first published: Sunday, November 21, 2021, 21:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X