For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JioMeet: జియో నుండి వీడియో కాన్ఫరెన్స్ యాప్, ఎన్నో ప్రత్యేకతలు

|

వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగం గత కొంతకాలంగా పెరుగుతోంది. జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌ను చాలామంది వినియోగిస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా 'జియోమీట్' పేరుతో ఈ తరహా యాప్‌ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ పవార్ వెల్లడించారు.

ఊహించినంత ప్రమాదం లేదు, కానీ ఒక్కటి మినహా కీలక రంగాలన్నీ ఢమాల్ఊహించినంత ప్రమాదం లేదు, కానీ ఒక్కటి మినహా కీలక రంగాలన్నీ ఢమాల్

జియోమీట్‌లో ఎన్నో ప్రత్యేకతలు

జియోమీట్‌లో ఎన్నో ప్రత్యేకతలు

జియోమీట్ ప్లాట్‌ఫాంకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి డివైజ్, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టం పైన అయినా ఇది పని చేస్తుంది. కొలాబ్రేషన్ అవసరాలను కూడా ఇది సమర్థవంతంగా తీరుస్తుందన్నారు. కేవలం సాధారణ వీడియో కాన్ఫరెన్స్ సేవలకే ఈ యాప్ పరిమితమవ్వదని తెలిపారు. జియో మీట్ వీడియో కార్ఫరెన్స్ యాప్‌ను వినియోగించేందుకు ఈ మెయిల్‌తో సైనప్ అవసరం లేకుండా కేవలం ఫోన్ నెంబర్‌తో లాగిన్ కావొచ్చు. ఇతర యాప్స్ మాదిరిగా సమావేశాల్ని షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఈ సేవలన్నీ

ఈ సేవలన్నీ

జియోకు చెందిన ఈ-హెల్త్ ప్లాట్‌ఫాంను మీట్ యాప్‌కు అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్‌లో వైద్యులతో సంప్రదింపులకు, ప్రిస్కిప్షన్ పొందేందుకు, మందులు ఆర్డర్ చేసేందుకు, వైద్య పరీక్షలకు ఈ మీట్ యాప్ వినియోగిస్తారు. అలాగే ఈ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాంతో విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ, హోమ్ వర్క్ ఇవ్వడం, టెస్ట్ నిర్వహణ, సొంతగా విద్యార్థులు మల్టీమీడియా నేర్చుకునే వెసులుబాటును కల్పించడం వంటి సేవలకు కూడా జియో మీట్ ఉపయోగపడుతుంది.

ప్రీప్లాన్‌లో అయిదుగురు

ప్రీప్లాన్‌లో అయిదుగురు

ఫ్రీప్లాన్‌లో అయిదుగురు కస్టమర్లు, బిజినెస్ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియోమీట్‌‌లో పాల్గొనవచ్చు. ఈ-మెయిల్, ఓటీపీ ఆధారిత లాగిన్స్ ద్వారా మీటింగ్స్‌లలో పాల్గొనవచ్చు. కాన్ఫరెన్సింగ్ లింక్ ద్వారా మధ్యలో జాయిన్ అవొచ్చు. కస్టమర్లు క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా సమావేశాల్లో పాల్గొనవచ్చు. మొబైల్స్, ట్యాబ్స్ కోసం HD వీడియో కాన్ఫరెన్స్ యాప్ ఉంది. జియోమీట్ అనేది జియో ప్లాట్‌ఫామ్‌లలో ఓ భాగం.

ఈ యాప్స్‌కు గట్టిపోటీ

ఈ యాప్స్‌కు గట్టిపోటీ

లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారితో సమన్వయం కోసం జూమ్, గూగుల్ మీట్, స్కైప్, వంటి యాప్స్ వినియోగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన టీమ్ యాప్ కూడా వినియోగిస్తున్నారు. జియోమీట్ యాప్ రానున్న కాలంలో వీటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. జియో మీట్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్, మ్యాక్స్ ఓఎస్ తదితర ప్లాట్ ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

English summary

JioMeet: జియో నుండి వీడియో కాన్ఫరెన్స్ యాప్, ఎన్నో ప్రత్యేకతలు | Jio Unveils JioMeet Video Conferencing Platform

Jio is jumping in the video conferencing arena and is set to launch its native platform called JioMeet.
Story first published: Saturday, May 2, 2020, 14:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X