For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంటల్లో రూ.1.56 లక్షల సంపద కోల్పోయిన జెఫ్ బెజోస్, అందుకే..

|

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద కొద్ది గంటల్లోనే 21 బిలియన్ డాలర్లు కుప్పకూలింది. అమెజాన్ డాట్ కామ్ ఇంక్ షేర్లు భారీగా నష్టపోవడంతో ఆయన సంపద క్షీణించింది. ఇది మన కరెన్సీలో రూ.1.56 లక్షల కోట్ల వరకు ఉంటుంది. శుక్రవారం అమెజాన్ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. అంతకుముందు సెషన్‌లో 2891.93 వద్ద ముగియగా, క్రితం సెషన్‌లో ఏకంగా 14.05 శాతం లేదా 406 డాలర్లు క్షీణించి 2485.63 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాది ప్రాతిపదికన, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక నెల.. ఇలా ఎలా చూసినా అమెజాన్ షేర్లు నష్టాల్లోనే కనిపిస్తున్నాయి.

నష్టాల కారణంగా

నష్టాల కారణంగా

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. 2015 తర్వాత ఈ కంపెనీ తొలిసారి నష్టాలను నమోదు చేసింది. అలాగే, రెండు దశాబ్దాల తర్వాత విక్రయాల వృద్ధి నెమ్మదించింది. దీంతో శుక్రవారం అమెజాన్ షేర్లు పడిపోయాయి. 2001 తర్వాత వృద్ధి మందగించడం ఇదే మొదటిసారి. దీంతో జెఫ్ బెజోస్ నికర సంపద 148.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాదిలో అత్యధికంగా అతని సంపద 210 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కానీ ఆ తర్వాత తగ్గింది. బెజోస్‌కు అమెజాన్‌లో 11.1 శాతం వాటాలు ఉన్నాయి.

43 బిలియన్ డాలర్లు డౌన్

43 బిలియన్ డాలర్లు డౌన్

జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపదలో అధిక వాటా అమెజాన్ షేర్లదే. 2022 క్యాలెండర్ ఏడాదిలో జెఫ్ బెజోస్ సంపద 43 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని సంపద 249 బిలియన్ డాలర్లు. అమెజాన్ షేర్లు మళ్లీ పుంజుకుంటే ఆయన సంపద తిరిగి పెరుగుతుంది.

అందుకే నష్టాలు

అందుకే నష్టాలు

అమెజాన్ నష్టాలకు కారణాలు ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అమెజాన్ గురువారం ప్రకటించింది. 3.84 బిలియన్ డాలర్ల నష్టాన్ని మోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్ల లాభాలను నివేదించింది. రివియాన్ మోటివ్ స్టాక్స్‌లో అమెజాన్ పెట్టుబడి పెట్టుబడి 7.6 బిలియన్ డాలర్ల నష్టాలకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ వ్యాపారంలో 1.28 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ నష్టాలను నమోదు చేసింది. దీంతో నికరంగా మార్చి త్రైమాసికంలో అమెజాన్ నష్టాలను ఎదుర్కొంది. కొత్త స్టోరేజ్ పాయింట్ల నిర్మాణం స్టోర్స్ నిర్మాణం, భారీ వేతనాలతో ఉద్యోగులను ఆకర్షించడం, కరోనా నుండి సాధారణ కార్యకలాపాలు పుంజుకొని ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ తగ్గించడం వంటివి అమెజాన్ వ్యాపారం నెమ్మదించడానికి కారణమైంది.

English summary

గంటల్లో రూ.1.56 లక్షల సంపద కోల్పోయిన జెఫ్ బెజోస్, అందుకే.. | Jeff Bezos loses $21 billion as Amazon shares slump

Jeff Bezos saw $20.5 billion of his fortune melt away after Amazon.com Inc.’s results left investors disappointed, helping fuel the worst month for technology stocks in years.
Story first published: Sunday, May 1, 2022, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X