For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోండా కార్లు కనిపించవిక: అమ్మకాలకు బ్రేక్: అక్కడి వాహన ప్రియులకు హైఓల్టేజ్ షాక్

|

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహనాలు, బైక్‌ల తయారీ సంస్థ హోండా.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాలో కార్ల తయారీ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో తమ సంస్థకు చెందిన కార్ల అమ్మకాలను నిలివేస్తున్నట్లు తెలిపింది. 2022 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది కాలంలో ఇప్పటిదాకా అందిన ఆర్డర్లను స్వీకరించడంతో పాటు, కొనుగోలుదారులకు కార్లను సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. రష్యాలో తమ ఆధీకృత డీలర్లు ఎవరికీ కార్లను సరఫరా చేయబోమని వివరించింది.

కార్ల తయారీని నియంత్రించడంలో భాగంగా మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హోండా మోటార్స్ కంపెనీ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది. రష్యన్ మార్కెట్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న తమ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లు, పవర్ ఎక్విప్‌మెంట్ల విక్రయాలు మాత్రం యధాతథంగా ఉంటాయని వివరణ ఇచ్చింది. రష్యాలో హోండా కంపెనీకి ఇప్పటిదాకా కార్ల తయారీ యూనిట్ లేదు. జపాన్‌కే చెందిన ఇతర వాహన తయారీ సంస్థలు టయోటా, నిస్సాన్‌లు రష్యన్ మార్కెట్‌ను ఆధారంగా చేసుకుని, అక్కడ తయారీ యూనిట్లను నెలకొల్పాయి. కిందటి నెలలో టయోటా, నిస్సాన్‌లకు చెందిన 79 వాహనాలు రష్యాలో అమ్ముడుపోయాయి.

Japans Honda Motor to stop auto sales in Russia in 2022

గత ఏడాదితో పోల్చుకుంటే.. రష్యన్ మార్కెట్‌లో వాహనాల అమ్మకాల్లో 50 శాతం క్షీణత కనిపించింది. ఈ ఏడాది జనవరం నుంచి నవంబర్ వరకు 15 శాతం మేర తగ్గాయి. 1383 వాహనాలు మాత్రమే విక్రయం అయ్యాయి. గత ఏడాది ఇదే కాలానికి 1.3 మిలియన్ల మేర వాహనాలను రష్యన్లు కొనుగులో చేశారు. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల వల్ల రష్యన్ మార్కెట్‌లో వాహనాల విక్రయాలు దిగజారాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రష్యన్ మార్కెట్‌లో వాహనాల విక్రయాలను నిలిపివేయాలని హోండా సంస్థ యాజమాన్యం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

English summary

హోండా కార్లు కనిపించవిక: అమ్మకాలకు బ్రేక్: అక్కడి వాహన ప్రియులకు హైఓల్టేజ్ షాక్ | Japan's Honda Motor to stop auto sales in Russia in 2022

The Russian subsidiary of Japan's Honda Motor Co said on Wednesday it would stop supplying new cars to official dealers in Russia in 2022 as part of the company's efforts to restructure its operations.
Story first published: Wednesday, December 30, 2020, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X