జనవరి - మార్చి క్వార్టర్‌లో దేశంలో బంగారం డిమాండ్ 36 శాతం క్షీణించింది. వివిధ కారణాల వల్ల బంగారం గిరాకీ 101.9 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. జ్యువెల్లరీ డిమాండ్, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ కూడా భారీగానే పడిపోయినట్లు WGC నివేదిక వెల్లడించింది. గోల్డ్ పరిశ్రమకు ఇది సవాల్‌తో కూడిన సంవత్సరం కావొచ్చునని చెబుతున్నారు.

బంగారం డిమాండ్ తగ్గడానికి కారణాలు
బంగారం డిమాండ్ పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నట్లు WGC తెలిపింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరతలు నెలకొని ఉన్నాయి. మరోవైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ బంగారం షాపులు మార్చి చివరలో మూసివేశారు. దీంతో బంగారానికి గిరాకీ తగ్గడంతో పాటు పెట్టుబడులు కూడా తగ్గాయని అంటున్నారు.

పరిశ్రమ కోలుకోవాలంటే..
లాక్ డౌన్ ముగిసిన తర్వాత స్వర్ణకారులతో సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభింప చేయడం, సరఫరా వ్యవస్థలను గాడిన పెట్టడంపై పరిశ్రమ పురోగతి ఆధారపడి ఉందని WGC తెలిపింది. బంగారం గిరాకీ తగ్గడంతో పాటు పెరుగుతున్న ధరల కారణంగా జ్యువెల్లరీ డిమాండ్, గోల్డ్ పెట్టుబడులు కూడా తగ్గడం గమనార్హం. ధరలు ఎలా ఉంటాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉండటం కూడా పెట్టుబడి పెట్టకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

విలువ ఆధారంగా...
బంగారం డిమాండ్ విలువ ఆధారంగా చూస్తే జనవరి - మార్చి క్వార్టర్‌లో 20 శాతం తగ్గి రూ.37,580కి పడిపోయింది. 2019లో ఇదే క్వార్టర్‌లో బంగారం గిరాకీ రూ.47,000 కోట్లుగా ఉంది. అంటే ధరలు పెరిగినప్పటికీ 36 శాతం అమ్మకాలు తగ్గడంతో వ్యాల్యూ పరంగా కూడా పడిపోయింది.

క్వార్టర్‌లో 25 శాతం పెరుగుదల
జనవరి - మార్చి క్వార్టర్‌లో బంగారం ధర 25 శాతం పెరిగి సగటున 10 గ్రాములకు రూ.36,875కు (కస్టమ్స్, ట్యాక్స్ మినహాయించి) చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.29,555 పలికింది. ప్రారంభంలో శుభకార్యాల వల్ల కొంత అమ్మకాలు జరిగాయి. కానీ ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్ వల్ల దెబ్బతిన్నది. అయితే పసిడి విక్రయాలు ఆన్‌లైన్‌కు చేరువ కావడం శుభపరిణామం అని WGC ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం అన్నారు.

బంగారం డిమాండ్, ధర ఎంత?
2019 జనవరి - మార్చి క్వార్టర్‌లో బంగారం డిమాండ్ రూ.47,000 కోట్లు కాగా ఈ ఏడాది అదే క్వార్టర్‌లో రూ.37,580 కోట్లుగా ఉంది. 20 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఆభరణాల డిమాండ్ గత ఏడాది 125 టన్నులు కాగా ఇప్పుడు 74 టన్నులకు తగ్గి 41 శాతం పడిపోయింది. పెట్టుబబడులు 17 శాతం, పెట్టుబడుల వ్యాల్యూ 4 శాతం తగ్గింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications