మరింత ఊరట: ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుపై శుభవార్త. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ గడువును 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది ఇన్‍కం ట్యాక్స్ డిపార్టుమెంట్(IT). కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ డిపార్టుమెంట్ ట్వీట్ చేసింది.
మీకు ఐటీ రీఫండ్స్ రాలేదా.. దానికి త్వరగా సమాధానం ఇవ్వండి!

రెండుసార్లు పొడిగింపు
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన గడువు తేదీ 2020 జూలై 31వ తేదీ. ఆ తర్వాత గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించింది ఐటీ డిపార్టుమెంట్. తాజాగా మరోసారి ఇప్పుడు నవంబర్ 30వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది. ఇదివరకు మూడు నెలల గడువు ఇవ్వగా, ఇప్పుడు మరో నెల పెంచి, మొత్తం నాలుగు నెలలు పొడిగించింది.

వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు
ప్రస్తుత పరిస్థితు ల దృష్ట్యా నవంబర్ 30 దాకా రిటర్న్స్ దాఖలుకు అవకాశం కల్పిస్తున్నామని అని ఐటీశాఖ తెలిపింది. ఐటీ కడుతున్నపుడు హౌసింగ్ లోన్స్, ఇన్సురెన్స్, పీపీఎఫ్ తదితర మినహాయింపులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. వీటి కింద ఈ నెల 31వ తేదీ వరకు చేసిన అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2019-20 రిటర్న్స్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఆగస్ట్ 15 వరకు పొడిగింపు
ఐటీ రిటర్న్స్‌తో పాటు 2019-20 టీడీఎస్, టీసీఎస్ స్టేట్‌మెంట్స్ గడువును కూడా ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఆదాయ పన్ను చెల్లింపు గడువు తేదీలను పెంచనున్నట్లు ప్రభుత్వం గత వారమే తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రివైజ్డ్ ఐటీ రిటర్న్స్ ఫాలే చేసే సమయాన్ని 31వ తేదీ వరకు పొడిగించింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం తేదీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. పన్ను ఆడిట్ నివేదిక గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించింది.