For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందికరమే

|

కరోనా కారణంగా భారత ఐటీ కంపెనీల ఆదాయాలు, వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం పడనుందని క్రిసిల్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. కరోనా కారణంగా ఆదాయాలు ఈసారి దశాబ్ద కనిష్టస్థాయి 2 శాతం, అంతకంటే దిగువకు పడిపోవచ్చునని, లాభదాయకత కూడా తగ్గుతుందని క్రిసిల్ వెల్లడించింది. లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు కొత్త డీల్స్ కోల్పోవడంతో పాటు ప్రస్తుత డీల్స్ పైన విదేశీ క్లయింట్లతో తిరిగి చర్చించే అవకాశం లేకపోవడం వల్ల అవి కూడా నష్టపోయే ప్రమాదముంటుందని తెలిపింది.

TCS వినూత్న ప్రయోగం: విప్రో, ఇన్ఫోసిస్ ఆ దారిలో నడవకుంటే ప్రయోజనాలు కోల్పోతారు!TCS వినూత్న ప్రయోగం: విప్రో, ఇన్ఫోసిస్ ఆ దారిలో నడవకుంటే ప్రయోజనాలు కోల్పోతారు!

రూ.7.28 లక్షల పరిమాణం, 40 లక్షల ఉద్యోగాలు

రూ.7.28 లక్షల పరిమాణం, 40 లక్షల ఉద్యోగాలు

దేశంలో ఐటీ రంగం పరిమాణం 9,700 కోట్ల డాలర్లు లేదా రూ.7.28 లక్షల కోట్లు. దేశంలోనే అతి పెద్ద సేవల ఎగుమతుల విభాగాల్లో అగ్రస్థానంలో ఉంది. ఐటి ఆధారిత రంగాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విభాగంలో 40 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 2008-09 సంక్షోభం అనంతరం గత కొన్నేళ్లుగా రెండెకల వృద్ధి నమోదు చేసుకుంటున్న సంస్థలపై కరోనా ప్రభావం భారీగా ఉండనుంది.

క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందులు

క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయ, లాభాలు పదేళ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. లాక్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభించడంతో ఐటీ సంస్థలు నూతన ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని, దీంతో భవిష్యత్తు ఆదాయ, లాభాలు 0-2% వరకు పడిపోవచ్చునని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో ఉన్న క్లయింట్స్‌తో తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఆయా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పేర్కొంది.

వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్ ఫ్రమ్ హోమ్

లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచిస్తున్నాయి. తద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వినియోగ రేటు 85 శాతం నుండి 90 శాతానికి పెరిగింది. దేశంలో 70 శాతం వాటా కలిగిన 15 పెద్ద ఐటీ కంపెనీల అధ్యయనం ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు తయారు చేసింది.

English summary

ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందికరమే | IT sector revenue growth may hit decadal low due

The Indian IT sector is staring at a revenue growth sliding to a decadal low of up to 2 per cent and an impact on profitability owing to narrowing of margins due to the Covid-19 pandemic.
Story first published: Sunday, April 26, 2020, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X