IT Multibagger: లక్ష పెట్టుబడిని రూ.36 లక్షలు చేసిన ఐటీ స్టాక్.. మీ దగ్గర ఉందా..?
IT Multibagger: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కూడా లాభాలు ఆర్జించటంతో పాటు కొన్నిసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అతి తక్కువ వ్యవధిలో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని అందించిన స్టాక్ మార్కెట్‌లో ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్ల సొమ్మును మూడు నుంచి నాలుగు రెట్లు చేస్తుంటాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఎలాంటి రాబడులను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
ఐటీ రంగం గత దశాబ్ధ కాలంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ రంగంలోకి చాలా కంపెనీలు అరంగేట్రం చేశాయి. కానీ గత కొంత కాలంగా అంతర్జాతీయ మాంద్యం కారణంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు పొదుపు చర్యలు మెుదలు పెట్టాయి. అయితే ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించిన ఒక ఐటీ స్టాక్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఐటీ సేవల కంపెనీ అయిన విప్రో గురించి. అవును ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది. ఐటీ మేజర్ విప్రో గడచిన 14 ఏళ్ల కాలంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్మును ఏకంగా రూ.36.6 లక్షలుగా మార్చేసింది. టాప్ ఐటీ కంపెనీల్లో ఇది ఒకటిగా నిలుస్తూ దేశంలో అగ్రగామి కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది.

బోనల్ షేర్లు..
ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రూ.412.35 వద్ద ఉన్న స్టాక్ ధర 2009 మార్చిలో మాత్రం రూ.50గా ఉంది. ఈ కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన వారికి మంచి రాబడులు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. 14 ఏళ్ల కాలంలో కంపెనీ జూన్ 2010లో 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లు, జూన్ 2017లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు, మార్చి 2019లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీ చేసింది.

గొప్ప రిటర్న్స్ ..
2009లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి రూ.50 షేర్ విలువ చొప్పున దాదాపు 2,000 షేర్లు వచ్చాయి. ఆ తర్వాత 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందుకోవటంతో 3,332 షేర్లు అదనంగా వచ్చాయి. అలా షేర్ల సంఖ్య రెండవసారి బోనస్ ప్రకటించినప్పుడు 3,332 నుంచి 6,664కు చేరుకుంది. ఆఖరిగా 2009లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను పరిగణలోకి తీసుకుంటే ఇన్వెస్టర్ వద్ద ఉండే షేర్ల సంఖ్య 8,885కు చేరుకుంటుంది. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపుగా రూ.36.6 లక్షలుగా ఉంది. దీర్ఘకాలంలో మంచి షేర్లను ఎంచుకునేవారికి లాభాలు తప్పక వస్తాయని ఈ స్టాక్ మరోసారి నిరూపించింది.
NOTE: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. అందుకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించటం ఉత్తమం.