For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్.. ఐటీ సంస్థల్లో లక్షల ఉద్యోగాలు, ట్రంప్ సహా కారణాలివే!

|

కరోనా మహమ్మారి కారణంగా జాబ్ మార్కెట్ డల్‌గా ఉంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ సెక్టార్ ఆశాజనకంగా ఉంది. అంతేకాదు, దిగ్గజ టెక్ సంస్థలు కూడా తాము ఉద్యోగులను నియమించుకుంటామని చెబుతున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక...
అయితే రెండో క్వార్టర్ లేదా మూడో క్వార్టర్ నుండి ఈ నియామకాలు ఉంటాయని చెబుతున్నాయి. భారత టాప్ 5 ఐటీ కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా లక్షకు పైగా ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రంప్ నిర్ణయంతో మన ఐటీ నిపుణులకు నష్టంలేదు.. ఎందుకంటే?ట్రంప్ నిర్ణయంతో మన ఐటీ నిపుణులకు నష్టంలేదు.. ఎందుకంటే?

క్లయింట్స్ ప్రాజెక్టుల పెరుగుదల.. అందుకే

క్లయింట్స్ ప్రాజెక్టుల పెరుగుదల.. అందుకే

కరోనా కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్లో ఎక్కువమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కొద్దిమంది మాత్రమే కార్యాలయాలకు వెళ్తున్నారు. కరోనా, లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు రావడం ప్రారంభమైంది. దీంతో ఉద్యోగులను తీసుకునేందుకు ఐటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కరోనా తదితర పరిణామాలతో పలుకంపెనీలు కొత్తగా డిజిటల్ మోడ్‌లోకి వచ్చాయి. కార్యకలాపాల ఖర్చులు తగ్గించుకునేందుకు ఔట్ సోర్సింగ్స్ పెరిగాయి. దీంతో ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు పెరగడంతో ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

కాంట్రాక్ట్ నియామకాలు పెరగవచ్చు

కాంట్రాక్ట్ నియామకాలు పెరగవచ్చు

జూన్ క్వార్టర్ ఫలితాల సమయంలో దాదాపు అన్ని ఐటీ దిగ్గజాలు కూడా గతంలోని క్యాంపస్ హైరింగ్స్‌ను గౌరవిస్తామని తెలిపాయి. అలాగే పలు సంస్థల డీల్ వ్యాల్యూస్ పెరిగాయి. డీల్స్ గతంలో కంటే పెరిగాయి. కరోనా పరిస్థితులు ప్రస్తుతానికి నియామకాలకు బ్రేక్ వేసి ఉండవచ్చునని, అయితే కంపెనీలు దీర్ఘకాలిక వ్యయ కట్టుబాట్లు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నందున కాంట్రాక్ట్ నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత మూడు నాలుగు నెలలుగా కంపెనీలు నియామకాలు చేపట్టలేదని, ప్రాజెక్టులు పెరుగుతున్నాయని, కాబట్టి నియామకాలు పెరగవచ్చునని అంటున్నారు.

ట్రంప్ నిర్ణయం... బెనిఫిట్

ట్రంప్ నిర్ణయం... బెనిఫిట్

దీనికి తోడు ఇటీవలి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఔట్ సోర్సింగ్‌ను పెంచి, తద్వారా ఇది భారత ఐటీ సంస్థలకు ప్రయోజనకరంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అమెరికాలోని భారతీయ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు స్థానికులను ఉద్యోగాల్లో నియమించుకొని, పని మొత్తం భారత్ నుండి నడిచేలా ఔట్ సోర్సింగ్ ఇస్తున్నాయని చెబుతున్నారు. ఇది మనకు లబ్ధి చేకూరుస్తుందంటున్నారు.

రిమోట్ హైరింగ్

రిమోట్ హైరింగ్

భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 40,000 కొత్త నియామకాలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. కరోనా కారణంగా గత త్రైమాసికంలో ఆదాయం బాగా పడిపోయినప్పటికీ మున్ముందు పుంజుకుంటుందని ఐటీ సెక్టార్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీసీఎస్ అమెరికాలో హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఆధారపడటం మరింత తగ్గించి స్థానికులను తీసుకోవాలని భావిస్తోంది. ఇన్పోసిస్ 20,000 మందిని హెచ్‌సీఎల్ టెక్ 15,000 మందిని తీసుకోనున్నట్లు ప్రకటించాయి. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో రిమోట్ హైరింగ్స్ చేపడుతున్నాయి.

English summary

గుడ్‌న్యూస్.. ఐటీ సంస్థల్లో లక్షల ఉద్యోగాలు, ట్రంప్ సహా కారణాలివే! | IT firms may hire over 1 lakh as clients increase outsourcing

It is welcome news that large information technology (IT) companies are poised to recruit over 100,000 people locally in an attempt to bolster their teams to complete clients’ projects who have migrated to digital and increased outsourcing to reduce operational costs.
Story first published: Friday, August 7, 2020, 7:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X