For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్టువేర్ షాక్: ఐటీలో 40,000 ఉద్యోగాలు పోవచ్చు, కానీ జాబ్స్ వస్తాయి!

|

బెంగళూరు: ఆర్థిక మందగమనం కారణంగా ఇటీవలి వరకు ఆటో పరిశ్రమ, ఎఫ్ఎంసీజీలో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా, ఐటీ రంగ నిపుణులు మోహన్‌దాస్ పాయ్ మరో షాకింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం భారత ఐటీ రంగంలో వృద్ధి నెమ్మదించిందని, అది మిడిల్ లెవల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు దాదాపు 30వేల నుంచి 40 వేల మంది మధ్యశ్రేణి ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు బ్యాడ్ న్యూస్, ఒంటి చేత్తో జగన్ ధ్వంసం: ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్

అలాంటి వారిని తొలగించేందుకు మొగ్గు

అలాంటి వారిని తొలగించేందుకు మొగ్గు

ఇతర దేశాల్లో వలే భారత్‌లోని ఐటీ కంపెనీలు కూడా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాయని మోహన్‌దాస్ పాయ్ అన్నారు. మంచి వృద్ధి నమోదు చేసినప్పుడు ప్రమోషన్లు సహజమేనని చెప్పారు. అయితే వృద్ధి తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా మిడిల్ లెవల్ ఉద్యోగులపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాంటి ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయన్నారు.

ఊరట.. ఇతర రంగాల్లో వారికి ఉద్యోగాలు

ఊరట.. ఇతర రంగాల్లో వారికి ఉద్యోగాలు

దాదాపు ప్రతి అయిదేళ్లకు ఓసారి ఇలాంటివి జరుగుతుంటాయని మోహన్‌దాస్ పాయ్ చెప్పారు. అయిదేళ్లకు ఓసారి ఇలాంటి ఉద్యోగాల కోతలు ఉంటాయని చెప్పారు. అయితే కాస్త మరో ఊరట కలిగించే విషయం కూడా ఆయన చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో 80 శాతం మందికి ఇతర రంగాల్లో మళ్లీ ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఎన్నో కొత్త కొత్త సెక్టార్‌లు పుట్టుకు వస్తున్నాయని, వాటిల్లో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

నైపుణ్యం ఉంటే రాణించవచ్చు...

నైపుణ్యం ఉంటే రాణించవచ్చు...

నైపుణ్యం ఉంటే ఎక్కడైనా రాణించవచ్చునని చెప్పారు. ఎవరైనా అద్భుత పనితీరు కనబరచకుంటే అత్యధిక వేతనానికి అర్హులుగా ఎవరినీ భావించలేమని మోహన్‌దాస్ పాయ్ అన్నారు. ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉన్నందున ఈ పరిశ్రమలో ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

English summary

సాఫ్టువేర్ షాక్: ఐటీలో 40,000 ఉద్యోగాలు పోవచ్చు, కానీ జాబ్స్ వస్తాయి! | IT companies may shed 30,000-40,000 mid-level staff: Mohandas Pai

India's information technology services companies may shed 30,000 to 40,000 middle level employees this year as growth slows down, IT industry veteran T V Mohandas Pai said Monday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X