For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISRO: క్లాస్‌రూముల్లో పెను మార్పు: శాటిలైట్ టీవీల ద్వారా టీచింగ్: తెలంగాణ సహా

|

బెంగళూరు: తరగతి గదుల రూపురేఖలు మరింత మారబోతోన్నాయి. పాఠ్యాంశాల బోధనలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులకు ఉపగ్రహ టీవీల పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధం చేసింది. దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నందున.. వాటి సేవలను వినియోగించుకోవడానికి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి- పార్లమెంటరీ ప్యానెల్‌ అందజేసిన ప్రతిపాదనలకు ఇస్రో అంగీకారం తెలిపింది.

IBMకు బిగ్‌షాక్: పెద్ద తలకాయ రాజీనామా: 14 నెలల్లోనే గుడ్‌బై: షేర్లు ఢామ్IBMకు బిగ్‌షాక్: పెద్ద తలకాయ రాజీనామా: 14 నెలల్లోనే గుడ్‌బై: షేర్లు ఢామ్

అంతేకాదు- రాష్ట్రాలకు శాటిలైట్ హక్కులను బదలాయించడానికి కూడా ఇస్రో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఇస్రో ప్రకటించింది. వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక సహకారాన్ని సైతం అందించడానికి సిద్ధమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.

ISRO will help the Central Govt to implement satellite TV Classrooms for school going students

దీనివల్ల వారి విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేయడంలో సహకారం అందిస్తామని ఇస్రో పేర్కొంది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సమాచారం ఇచ్చంది. శాటిలైట్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలనే విషయంపై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు, దూరదర్శన్ అధికారులు హాజరయ్యారు.

ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్‌లకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా వారంతా ఒక అవగాహనకు వచ్చారు. టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించంలో తమ ఆధీనంలో ఉన్న శాటిలైట్లను వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వాటిని ఎలా వినియోగించాలనే విషయంపై అధికారులకు శిక్షణ కూడా ఇస్తామని, రాష్ట్రాలకు శాటిలైట్ల హక్కులను బదలాయించడానికి కూడా సిద్ధమని అన్నారు.

English summary

ISRO: క్లాస్‌రూముల్లో పెను మార్పు: శాటిలైట్ టీవీల ద్వారా టీచింగ్: తెలంగాణ సహా | ISRO will help the Central Govt to implement satellite TV Classrooms for school going students

ISRO will help the Government of India to implement satellite TV Classrooms for school going students. The satellite TV classrooms will solve the issue being faced by the students during the online classes.
Story first published: Saturday, July 3, 2021, 14:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X