For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

notice peiod: నోటీసు పీరియడ్‌ కు 'NO' చెప్తే.. ఊ అంటారా.. ఉఊ అంటారా ?

|

notice peiod: ఓ అభ్యర్థి ఉద్యోగంలో చేరే ముందు కంపెనీలు వివిధ పత్రాలపై సంతకాలు తీసుకుంటాయి. వాటిలో తప్పనిసరిగా నోటీసు పీరియడ్ కు సంబంధించినది ఒకటి ఉంటుంది. ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో దానిలో చేరాలనుకునే సమయంలో ఈ నోటీసు వ్యవధికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. కంపెనీతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, రాజీనామా అనంతరం కొన్ని దినాలు తప్పనిసరిగా ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థకు సేవలందించాల్సి ఉంటుంది. దీనినే కార్పొరేట్ సంస్థల భాషలో నోటీసు పీరియడ్ గా వ్యవహిస్తారు.

నోటీసు పీరియడ్ తప్పనిసరా..?

నోటీసు పీరియడ్ తప్పనిసరా..?

నోటీసు వ్యవధిని అందించే నియమం దాదాపు ప్రతి సంస్థలోనూ ఉంటుంది. కానీ నియమ, నిబంధనలు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటాయి. తప్పనిసరిగా నోటీసు పీరియడ్‌ చేయాలా అంటే మాత్రం అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయా కంపెనీలు నోటీసు వ్యవధిలో కొన్ని రకాల వెసులుబాటను ఉద్యోగులకు కల్పిస్తాయి.

సంస్థకు చెందిన మానవ వనరుల విభాగాన్ని సంప్రదిస్తే, నోటీసు పీరియడ్‌ కు అందుబాటులో ఉన్న అవకాల గురించి పూర్తిగా వివరిస్తారు. నోటీసు వ్యవధిని అందించమని ఏ కంపెనీ కూడా ఉద్యోగిని బలవంతం చేయలేదు.

నియమ నిబంధనలు

నియమ నిబంధనలు

ఆయా సంస్థల నిబంధనలు ప్రకారం సాధారణంగా నోటీసు వ్యవధి 15 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఉద్యోగి కంపెనీలో చేరేప్పుడే అపాయింట్ మెంట్ లెటర్‌ లో నోటీసుకు సంబంధించిన నిబంధనలు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని సంస్థల్లో నోటీసు వ్యవధి అందించడం తప్పనిసరి కాదు. అందుకు బదులుగా ఆ వ్యవధికి సంబంధించిన వేతనాన్ని కంపెనీకి చెల్లించి బయటకు రావచ్చు.

ప్రభుత్వ ఆదేశానుసారం ఉద్యోగికి లభించిన సెలవులను సైతం ఇందుకు వినయోగించుకోవచ్చు. ఏదేమైనా సంస్థతో పూర్తిగా సంప్రదింపులు జరిపి, ఇరువురూ ఓ అంగీకారానికి రావాల్సి ఉంటుంది. లేదంటే తదనంతర ఉద్యోగ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అసలెందుకీ నోటీసు వ్యవధి

అసలెందుకీ నోటీసు వ్యవధి

నోటీసు వ్యవధి అనేది ముఖ్యంగా కంపెనీల అవసరం కోసం తీసుకువచ్చిన ఓ విధానం. కానీ సంస్థతో పాటు ఉద్యోగులకూ ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ నుంచి ఓ ఉద్యోగి బయటకు వెళ్లాలని భావిస్తే, అతడు/ఆమె స్థానంలో అర్హతలు కలిగిన ఇంకొకరిని తీసుకువచ్చేందుకు ఆయా సంస్థలకు కొంత సమయం పడుతుంది.

అదే విధంగా ఉద్యోగి సైతం కంపెనీ నుంచి బయటకు వచ్చిన అనంతరం మరో కొలువు వెదుక్కోవడం కంటే.. ప్రస్తుత సంస్థలో పనిచేస్తూనే మరోచోట ఉద్యోగం సాధించుకునే అవకాశం ఈ విధానంలో లభిస్తుంది. తద్వారా ఉద్యోగం లేని స్థితిలో భవిష్యత్తు ఖర్చుల గురించిన మానసిక ఆందోళన నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది.

English summary

notice peiod: నోటీసు పీరియడ్‌ కు 'NO' చెప్తే.. ఊ అంటారా.. ఉఊ అంటారా ? | Is serving notice period compulsory ?

Notice period rules and remedies..
Story first published: Tuesday, January 24, 2023, 6:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X