For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందగమనం ఎఫెక్ట్, 2014 తర్వాత అతి తక్కువ IPOలు

|

ఆర్థిక మందగమన పరిస్థితులు IPO మార్కెట్‌ను దెబ్బతీశాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడం మంచిది కాదనుకున్న సంస్థలు పబ్లిక్ ఇష్యూస్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (IPO) గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 60% పడిపోయాయి. గత ఏడాది IPOల ద్వారా వివిధ సంస్థలు సమీకరించిన నిధులు వ్యాల్యూ రూ.30,959 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.12,362 కోట్లు మాత్రమే.

2019లో 16 సంస్థలు మాత్రమే IPOకి వచ్చాయి. అదే సమయంలో 2018లో 24 వచ్చాయి. ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద ఐపీవో స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్. రూ.2,850 కోట్ల నిధులను సమీకరించింది. 2019లో సగటు ఐపీవో వ్యాల్యూ రూ.773 కోట్లుగా నమోదయింది. మొత్తం 16 ఐపీవోల్లో ఏడింటికి 10 రెట్లకు పైగా ఆదరణ వచ్చింది. IRCTC ఐపీవోకు 109 రెట్లు స్పందన వచ్చింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 100 రెట్లు ఆదరణ లభించింది.

బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..

IPOs overall beat the market this year despite some mega busts

ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలను భయాలు చుట్టుముట్టాయి. జీడీపీ కూడా తగ్గుతూ వచ్చింది. వాస్తవానికి సెబి అనుమతులు ఇచ్చిన 47 సంస్థలు ఈ ఏడాది ఐపీవోకు రాలేదు. రూ.51వేల కోట్లకు పైగా నిధుల సమీకరణకు లైన్ క్లియర్ అయినప్పటికీ మందగమన ప్రభావం పడింది. చిన్న, మధ్యశ్రేణి కంపెనీలు నిధుల సమీకరణ మందకోడిగా ఉండటంతో కంపెనీలు భయపడ్డాయి.

ఈసారి నిరుపయోగంగా మారిన అనుమతుల్లో ఎస్ఎంఈ ఐపీవోలు రూ.12,982 మాత్రమే సేకరించాయి. గత ఏడాది ఈ మొత్తం రూ.33,246 కోట్లు వసూలు చేశాయి. అదే 2014లో ఈ మొత్తం రూ.1,468 కోట్లుగా ఉన్నాయి. ఈసారి ఐపీవోకు వచ్చిన 16 ప్రధాన కంపెనీల్లో ఏడు కంపెనీలకు దాదాపు 10 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

English summary

మందగమనం ఎఫెక్ట్, 2014 తర్వాత అతి తక్కువ IPOలు | IPOs overall beat the market this year despite some mega busts

This year’s IPOs crop wasn’t as bad as it may have appeared. Despite the high profile struggles of Uber and Lyft shares, an index that tracks initial public offerings has outperformed the S&P 500 in what could be a historic year for stocks.
Story first published: Friday, December 27, 2019, 15:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X