For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత మార్కెట్‌లోకి తైవాన్ కంపెనీ: త్వరలో పబ్లిక్ ఇష్యూ: రూ.వేల కోట్లు సేకరణపై టార్గెట్

|

ముంబై: తైవాన్‌కు ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్.. త్వరలో భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఐఫోన్లను తయారు చేసే ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో యూనిట్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టింది. తాజాగా. అదే రేంజ్‌లో నిధులను సేకరించడానికి సన్నాహాలు చేపట్టబోతోంది. దీనికోసం పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతోంది. దీనికి అవసరమైన ప్రాథమిక చర్యలను తీసుకుందని, చర్చలనూ ముగించుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ అమౌంట్‌‌: ఇక ఇంట్లో నుంచే ఇలా కట్టొచ్చు: వడ్డీ రేటు మాటేంటీ?పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ అమౌంట్‌‌: ఇక ఇంట్లో నుంచే ఇలా కట్టొచ్చు: వడ్డీ రేటు మాటేంటీ?

తైపీ ప్రధానకేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఫాక్స్‌కాన్ భారత స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. త్వరలోనే ఆ కొరతను తీర్చుకోవడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను జారీ చేయడ ద్వారా కనీసం 5,000 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ సంస్థ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద బిలియన్ డాలర్ల వ్యయంతో యాపిల్ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది. దీనికి కొనసాగింపుగా భారత మార్కెట్‌లో అడుగు పెట్టడానికి అవసరమైన చర్యలను చేపట్టిందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

iPhone maker Foxconn prepares for Rs 5,000 crore IPO in India, says Reports

చైనాపై వ్యతిరేకత మొదలైన తరువాత.. తమ ఉత్పాదక కార్యకలాపాలన్నింటినీ భారత్‌కు మళ్లించడంలో భాగంగా తమిళనాడులో భారీగా పెట్టుబడులను పెట్టడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందా సంస్థ. ప్రస్తుతం తమిళనాడు, ఏపీల్లో ఫాక్స్‌కాన్‌కు రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. యాపిల్, షావోమి స్మార్ట్‌ఫోన్లకు అవసరమైన విడి భాగాలను ఈ రెండు యూనిట్లలో తయారు చేస్తోంది. ఇదివరకు 2018లో ఫాక్స్‌కాన్ షాంఘై స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది.

అది విజయవంతం కావడంతో ఇక భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్‌తో పాటు ఐఫోన్‌ విడి పరికరాలను తయారు చేసే కాంట్రాక్ట్‌ను పొందిన విస్ట్రాన్, పెగట్రాన్ కంపెనీలు కూడా వచ్చే అయిదేళ్ల కాల వ్యవధిలో 900 మిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాశాలను పరిశీలిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాను బ్రాండ్లకు భారత్, అమెరికా వంటి కొన్ని దేశాల్లో డిమాండ్ తగ్గిపోవడంతో.. అవే తయారీ యూనిట్లను భారత్‌కు తరలించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకున్నట్లు అభిప్రాయపడుతున్నాయి.

English summary

భారత మార్కెట్‌లోకి తైవాన్ కంపెనీ: త్వరలో పబ్లిక్ ఇష్యూ: రూ.వేల కోట్లు సేకరణపై టార్గెట్ | iPhone maker Foxconn prepares for Rs 5,000 crore IPO in India, says Reports

Foxconn, the Taiwanese contract manufacturer and assembler of Apple iPhones among other brands is reportedly in preliminary discussions to float an initial public offer (IPO) worth over Rs 5,000 crore in India.
Story first published: Tuesday, January 12, 2021, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X