For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

|

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు క్రమంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా సిప్ పెట్టుబడి పెట్టేవారు పెరుగుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్ల మంచి ఎంపికలని నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.

దీర్ఘకాలం మంచిది..

దీర్ఘకాలం మంచిది..

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు.. మీరు ఎంత నష్టభయం భరించగలరనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నష్టభయం, రాబడిని బట్టి సరైన ఫండ్లను ఎంచుకోవాలి. దీర్ఘకాలంలో మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిస్క్ తీసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. నష్టభయం అధికంగా భరించగలిగితే.. మీరు అధిక రాబడిని అందించే పథకాలను ఎంచుకోవచ్చు.

ఎప్పుడూ ఒకే చోట ఉచ్చొద్దు..

ఎప్పుడూ ఒకే చోట ఉచ్చొద్దు..

పెట్టుబడులు ఎప్పుడూ ఒకే చోట ఉండకూడదనేది నియమాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఒకే తరహాలో ఉండే రెండు పథకాలను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది కాదంటున్నారు. వేర్వేరు ఫండ్‌ సంస్థలకు చెందిన వివిధ తరగతులకు చెందిన ఫండ్లను ఎంచుకోవడం వల్ల నష్టభయం తగ్గుతుంది.

ఫండ్ మేనేజర్ చరిత్ర..

ఫండ్ మేనేజర్ చరిత్ర..

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. ఆ ఫండ్‌ సంస్థ చరిత్ర, అందించిన రాబడి తదితరాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎచ్చుకోవచ్చు. అలాగే ఫండ్ మేనేజర్ చరిత్రను కూడా గమనించాలి. సెక్టోరియల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.

ఇండెక్స్ ఫండ్లు

ఇండెక్స్ ఫండ్లు

ఫండ్లలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి మంచిది కాదు. క్రమానుగతంగా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మార్కెట్‌ వివిధ దశల్లో మదుపు చేసేందుకు అవకాశం వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది.

English summary

Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే.. | Investors in mutual funds should know some important things

Investors in mutual funds should know some important things. So you will get better returns.
Story first published: Saturday, July 23, 2022, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X