For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Funds: ఈక్విటి మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు..

|

ఈక్విటి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) డేటా ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఏప్రిల్‌లో రూ. 6,480 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నెలతో పోలిస్తే మూడో వంతు పెట్టుబడులు తగ్గాయి. ఇది గత 12 నెలల సగటు కంటే 47% తక్కువ. గత ఏడాది నవంబర్‌ తర్వాత ఈక్విటి ఫండ్లలో పెట్టుబబడులు తగ్గుతున్నాయి.

లార్జ్ క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. మార్చి నెలలో రూ.911 కోట్లుగా ఉన్న పెట్టబడులు ఏప్రిల్‌లో రూ.53 కోట్లకు పడిపోయింది. స్మాల్ క్యాప్ ఫండ్లలో మార్చిలో రూ.2,430 కోట్లు ఉండాగా.. ఏప్రిల్ లో రూ.2,128 తగ్గింది. మిడ్ క్యాప్ ఫండ్లలో మార్చిలో రూ.2,182 కోట్ల పెట్టుబడులు రాగా.. అవి ఏప్రిల్ కు రూ.1,782 కోట్లకు తగ్గాయి.

Investments

ఆసక్తికరంగా, గత కొన్ని సంవత్సరాలలో ఏప్రిల్‌లో ఇన్‌ఫ్లోలు అస్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 2022లో రూ.15,890 కోట్ల ఇన్‌ఫ్లోలు రాగా, ఏప్రిల్ 2021 మరియు 2020లో ఇన్‌ఫ్లోలు వరుసగా 3,437 కోట్లు మరియు 6,213 కోట్లుగా ఉన్నాయి. అయితే, ఏప్రిల్ 2020 కోవిడ్ సంక్షోభం కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ గందరగోళంలో ఉన్నప్పుడు మరియు పెట్టుబడి సెంటిమెంట్ బలహీనంగా ఉంది.

నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) స్వల్పంగా తగ్గి 13,727 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్‌లో నమోదైన కొత్త SIPల సంఖ్య 1.9 మిలియన్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు 146.4 మిలియన్ల ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి, రిటైల్ స్కీమ్ ఫోలియోలు 116.9 మిలియన్ల వద్ద రికార్డు స్థాయిలో ఉన్నాయి.

Investments

"ఇటీవల చూసిన మార్కెట్లలో తీవ్ర పెరుగుదల కారణంగా, ఇన్వెస్టర్లు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి మరింత అనుకూలమైన సమయం కోసం వేచి ఉండడాన్ని ఎంచుకుని ఉండవచ్చు" అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

English summary

Mutual Funds: ఈక్విటి మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన పెట్టుబడులు.. | Investments in equity mutual funds have fallen sharply

Investments in equity mutual funds have declined. According to Association of Mutual Funds in India (Amfi) data.. Equity mutual fund schemes in April were Rs. 6,480 crore investments.
Story first published: Wednesday, May 17, 2023, 12:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X