For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఇన్వెస్కో.. ఏడాదిలో రెండోసారి ఇలా..

|

Swiggy: ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ గా స్విగ్గీకి మంచి పేరుంది. కానీ కంపెనీ మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో ఏడాదిలో రెండోసారి స్విగ్గీ వాల్యుయేషన్‌ ను తగ్గించింది. US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. జనవరి 2022లో 10.7 బిలియన్ డాలర్లుగా పేర్కొనగా, ఇప్పుడు దానిని కాస్తా దాదాపు 5.5 బిలియన్లకు అంటే దాదాపు సగానికి తగ్గించింది.

జనవరి 31, 2023 నాటికి స్విగ్గీ షేర్‌లను 3,305 డాలర్లుగా ఇన్వెస్కో విలువ కట్టింది. గతేడాది అక్టోబర్ లో ఇది 4,759గా నిర్ణయించింది. ఒక్క ఏప్రిల్‌లోనే కంపెనీ వాల్యూని 10.7 బిలియన్ల నుంచి 8.2 బిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ నెల ప్రారంభంలో దీనిపై స్పందించిన స్విగ్గీ, ఇన్వెస్కో వాల్యుయేషన్ ను ఖండించింది.

Swiggy

వచ్చే ఏడాది తన IPOను లాంచ్ చేయడం కోసం స్విగ్గీ తీవ్రంగా కృషి చేస్తోంది. కాగా ఈ నెలలో తన కోర్ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తన వాల్యుయేషన్‌ ను జనవరి 2022లో 10 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. అయితే జూలై 2021లో దాని ప్రత్యర్థి జొమాటో 12 బిలియన్ డాలర్ల విలువతో IPOకి వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం గడిచిన 21 నెలల్లో దాని మార్కెట్ క్యాప్‌ లో 45 శాతాన్ని కోల్పోయింది.

Swiggy

FY22లో స్విగ్గీ స్థూల ఆదాయం (GMV) 2.2 రెట్లు పెరిగి 5 వేల 705 కోట్ల రూపాయలకు చేరుకుంది. దాని నష్టాలు సైతం అదే స్థాయిలో 2.2 రెట్లతో 3 వేల 629 కోట్లకు పెరిగాయి. FY23 మొదటి అర్ధ భాగంలో కంపెనీ రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ GMV 1.3 బిలియన్లుగా ఉంది. కంపెనీ ప్రారంభ మద్దతుదారు ప్రోసస్ ఈ మేరకు నివేదికను ప్రచురించింది. సంస్థ తన FY23 గణాంకాలను ఫైల్ చేయాల్సి ఉంది.

English summary

Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఇన్వెస్కో.. ఏడాదిలో రెండోసారి ఇలా.. | Invesco cuts Swiggy's valuation second time in a year

Invesco cuts Swiggy's valuation second time in a year
Story first published: Tuesday, May 9, 2023, 8:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X