For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Postal Scheme: కొత్త ఏడాది వడ్డీ పెంచిన పోస్టాఫీస్.. ఇన్వెస్ట్ చేసేవారికి పూర్తి వివరాలు..

|

Kisan Vikas Patra: జనవరి-మార్చి త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ఈ నిర్ణయం వల్ల ఒక పోస్టల్ స్కీమ్ సైతం భారీగా ప్రయోజనాన్ని పొందుతోంది. అది ప్రజల్లో చాలా కాలం నుంచే ప్రాచుర్యం పొందిన స్కీమ్. నూతన సంవత్సరం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపికని చెప్పుకోవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర..

కిసాన్ వికాస్ పత్ర..

కేంద్ర ప్రభుత్వం తాజాగా కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడిపై వడ్డీ రేటును పెంచింది. సాధారణంగా భారతీయులు పోస్టల్ పెట్టుబడులను ప్రథమ ఎంపికగా పరిగణిస్తుంటారు. అందుకే ఈ స్కీమ్స్ లో రెట్టింపు మెుత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బాగా ప్రజాధరణ పొందిన కిసాన్ వికాస్ పత్రకు గతంలో 7 శాతం వడ్డీని అందించిన కేంద్రం ఇప్పుడు దానిని 7.20 శాతానికి పెంచింది.

స్కీమ్ మెచ్యూరిటీ..

స్కీమ్ మెచ్యూరిటీ..

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ 10 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఇందులోని పెట్టుబడిదారులు జనవరి 1, 2023 నుంచి 120 నెలల పాటు పెట్టుబడిపై 7.2 శాతం వడ్డీని పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీరు కొత్త వడ్డీ రేటు నుంచి రాబడిని పొందేందుకు సరైన అవకాశం అని చెప్పుకోవాలి. కనీసం రూ.1000 పెట్టుబడితో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ పథకంలో తన పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

కనీస అర్హతలు..

కనీస అర్హతలు..

పెట్టుబడి విషయంలో ఎలాంటి గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించలేదు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎవరైనా సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దేశంలోని ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి కిసాన్ వికాస్ పత్ర కింద ఖాతాను తెరవవచ్చు. ఎవరైనా ఈ పథకాన్ని తీసుకున్న ఏడాదిలో విత్ డ్రా చేసుకున్నట్లయితే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఖాతా తెరవడం ఎలా..?

ఖాతా తెరవడం ఎలా..?

ఈ పోస్టాఫీసు పథకంలో 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ తరపున గార్డియన్, కుటుంబ సభ్యులు ఖాతాను తెరవవచ్చు. మైనర్ ఇన్వెస్టర్ వయస్సు 10 ఏళ్లు అయిన వెంటనే.. ఖాతాను వారి పేరు మీద బదిలీ చేయబడుతుంది. పోస్టాఫీసులో దరఖాస్తుతో పాటు డిపాజిట్ రసీదు నింపాల్సి ఉంటుంది. ఆ సమయంలో పెట్టుబడి మెుత్తాన్ని నగదు, చెక్కు లేదా డీడీ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌తో పాటు పెట్టుబడిదారులు తన గుర్తింపు కార్డును కూడా జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు, డబ్బును సమర్పించిన తర్వాత కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ పొందుతారు.

English summary

Postal Scheme: కొత్త ఏడాది వడ్డీ పెంచిన పోస్టాఫీస్.. ఇన్వెస్ట్ చేసేవారికి పూర్తి వివరాలు.. | Interest Paid on Kisan Vikas Patra Increased to 7.2% from january 1st, 2023

Interest Paid on Kisan Vikas Patra Increased to 7.2% from january 1st, 2023
Story first published: Monday, January 2, 2023, 17:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X